అన్వేషించండి

YSRCP Kodali Nani : అమిత్ షా 150 సీట్లు అడిగాడు - చంద్రబాబు పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి - కొడాలి నాని సెటైర్లు

YSRCP Kodali Nani : పవన్ , చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై తేల్చుకోలేకపోతున్నారన్నారు.

Kodali Nani :  చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కొడాలి నాని మండిపడ్డారు.  గుడివాడలో ముస్లింలతో నిర్వహించిన  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా  చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కామెంట్స్ చేశారు.  " అమిత్ షా ఏం చెప్పాడో. నువ్వు పాతిక తీసుకోని నాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్లు ఉన్నాడు. అప్పుడంటే.. అద్వానీ, వాజ్ పేయీ ఉండేవారు. చంద్రబాబు ఏం చెబితే ఆ కథలన్నీ వినేవాళ్లు. ఇప్పుడున్నది అమిత్ షా, మోదీ.. వాళ్లేం వింటారు? మేము 150 అసెంబ్లీ, 20 ఎంపీ సీట్లలో పోటీ చేస్తాం. నువ్వు పాతిక అసెంబ్లీ, 5 ఎంపీ పోటీ చేసుకో అని చంద్రబాబుతో చెప్పినట్లు ఉన్నారు. ఇందుకు అవును అంటే ఒక ప్రాబ్లమ్, కాదు అంటే మరొక ప్రాబ్లమ్. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చి 7 రోజులు అయ్యింది. వాళ్ల దెబ్బకు మంచం మీద పడినట్లు ఉన్నాడు. హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు. ముందు గొయ్యి, వెనుక నుయ్యి.. అవునని చెప్పలేడు, కాదని చెప్పలేడు. కాదని చెప్పి ముందుకెళితే భయంకరమైన దాడి ఉంటుంది. అవును అని చెబితే ఇది తోక పార్టీ అవుతుంది” అని విమర్శలు గుప్పించారు. 


చంద్రబాబు తన ముందేమో బీజేపీ వదినమ్మను, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మను అడ్డు పెట్టుకున్నారని విమర్శించారు.  ”కుట్రలు, కుతంత్రాలు, చెల్లెమ్మ, వదినమ్మ, దత్తపుత్రుడు, పనికి రాని వాళ్లను ఎంతమందిని వేసుకొచ్చినా.. ఏమీ ఒరిగేది లేదు. మీరంతా అప్రమత్తంగా ఉండండి. ప్రతి నిమిషం కూడా మీ కోసం తపిస్తున్నారు జగన్. ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నారా.. జగన్ మోహన్ రెడ్డిని తప్పించి.. జగన్ నన్ను  చూసి భయపడతాడని చంద్రబాబు అంటారు. రా మరి చూసుకుందాం అంటే.. పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. మరో పక్క ఉత్త పుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు.  వీళ్లు సరిపోరు.. వదినమ్మ ముందు ఉండాలి. వీళ్లంతా ఉన్నారు అంటే.. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మను తెచ్చుకున్నాడు" అని విమర్శించారు. 

 పవన్ కల్యాణ్ పైన కొడాలి నాని మండిపడ్డారు.  ”పవన్ కల్యాణ్.. విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడట. కాలేజీ బిల్డింగ్ ల మధ్య దిగిపోతాడట. ఆర్ అండ్ బీ, ఫైర్ డిపార్ట్ మెంట్ వాళ్లు నో చెప్పారు. రెక్క ఏదైనా తగిలి ప్రమాదం జరుగుతుంది, ఆ తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మేము ఏదో చేశామని అంటారు. కాబట్టి, ఊరి బయట ఎక్కడైనా దిగు అని చెబితే.. అందుకు పవన్ ఒప్పుకోలేదు. మంగళగిరిలోనే కూర్చున్నాడు. పవన్ కల్యాణ్ జనంలోకి వెళితే అడుగుతారు. మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం. ఏయే సీట్లలో పోటీ చేస్తున్నాం అని కార్యకర్తలు, నాయకులు అడుగుతారు. దానికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పలేడన్నారు. 

పవన్ సమాధానం చెప్పాలంటే ఢిల్లీ వాళ్లు చెప్పాలి. ఇవన్నీ తప్పించుకోవడానికే పవన్ కల్యాణ్ నాటకాలు ఆడుతున్నాడు. విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది. కారులో గంటన్నరలో వెళ్లొచ్చు. రేపు భీమవరంలో పోటీ చేసి గెలిచాక భీమవరం వెళ్లాలంటే హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే వెళ్తాను అంటారా? కాబట్టి భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి. హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలని కొడాలి నాని సలహా ఇచ్చారు. 

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
మూలా నక్షత్రం రోజు అతి తక్కువ సమయంలో ఉచిత దర్శనం, విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య సూచనలు!
మూలా నక్షత్రం రోజు అతి తక్కువ సమయంలో ఉచిత దర్శనం, విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య సూచనలు!
YS Jagan Support CJP : CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !
CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget