Breaking News Live: ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు కుటుంబ సభ్యుల ప్రకటన
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో వాతావరణం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని ప్రాంతాలల్లో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు.
దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదని కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతాయిని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామలో 18.6 డిగ్రీలు, కళింగపట్నంలో 22 డిగ్రీలు, బాపట్లలో 19.3 డిగ్రీలు, అమరావతిలో 19.3 డిగ్రీలు, విశాఖపట్నంలో 22.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా మారింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ సైతం భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 15.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 17.5 డిగ్రీలు, నంద్యాలలో 18.5 డిగ్రీలు, తిరుపతిలో 19 డిగ్రీలు, కర్నూలులో 21.1 డిగ్రీలు, కడపలో 21.6 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
Telangana Weather Updates: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో వాతావరణం వేడెక్కుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యల్పంగా నల్గొండలో కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదు కాగా, ఆదిలాబాద్ లో 18.1, భద్రాచలంలో 20.8, దుండిగల్‌లో 18.2, మెదక్ జిల్లాలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా తగ్గింది. గ్రాముకు రూ.1 చొప్పున తగ్గింది. వెండి ధర నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,990 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,180 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న కిలోకు రూ.1400 పెరగ్గా రూ.70,000కు చేరింది. నేడు కూడా అదే ధర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,990 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.
ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు కుటుంబ సభ్యుల ప్రకటన
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల నిర్వహణ స్థలాన్ని మార్చుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముందు గౌతమ్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(మెరిట్స్) కాలేజీ గ్రౌండ్ లో బుధవారం 11 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఎయిర్ అంబులెన్స్ లో రేపు నెల్లూరుకు తరలించనున్నారు.
పత్తికొండ బైపాస్ లో రెండు బైక్ లు ఢీ, ఇద్దరు మృతి
కర్నూలు జిల్లా పత్తికొండ బైపాస్ రోడ్ లో రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు నరేష్, నవీన్ మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు యూసుఫ్, నరేంద్ర పరిస్థితి విషమం ఉంది. వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అనారోగ్యం పాలైన లాలు ప్రసాద్ యాదవ్, పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. స్టేబుల్‌గా ఉన్నారని వెల్లడించారు.
Farmer Locks MRo Office: నల్లగొండ జిల్లాలో పెద్దవురా ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన రైతులు
Farmer Locks MRo Office In Nalgonda District: నల్లగొండ జిల్లా: పెద్దవురా తహశీల్దార్ కార్యాలయానికి తమ్మడపల్లి గ్రామ రైతులు తాళాలు వేశారు. తమ్మడపల్లి గ్రామంలో ఉన్న పట్టభూములను అసైన్డ్ భూములుగా మార్చిన కంప్యూటర్ ఆపరేటర్. 2019 నుండి ఇప్పటి వరకు క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ కావటం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. 220 సర్వే నెంబర్లులో సుమారుగా 1500 ఎకరాలను అసైన్డ్ భూములుగా మార్చారని ఆరోపించారు.
ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతుల కుటుంబాలు
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపూరి ఖేరి బాధితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. లఖింపూరి రైతుల మరణాల కేసులో ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్నాడు.