అన్వేషించండి

KA Paul: పదేళ్లలో 9 పార్టీలు, నువ్వు రాజకీయాలకు పనికిరావు, ఇంట్లోనే ఉండు లేదంటే - కేఏ పాల్ వ్యాఖ్యలు

KA Paul Comments: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కేఏ పాల్ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో తాను చేసే మౌన పోరాటానికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

KA Paul Comments On Pawan Kalyan: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గత పదేళ్లలో 9 పార్టీలతో కలిశారని, ఆయన రాజకీయాలకు పనికిరారని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన్ను ఎవరు నమ్మటం లేదని, వీవీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా ఆయనను విడిచిపెట్టేశారని అన్నారు. పవన్ కల్యాణ్ యాక్టర్‌గా ఉండిపోయి ఇంట్లోనే ఉండిపోవాలని, చిత్తశుద్ధి ఉంటే తన ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. 

పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న మోసానికి నిరసనగా తాను ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం (జూలై 20) ధర్నా చేస్తానని కేఏ పాల్ చెప్పారు. అంతేకాక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌, టీడీపీ చీఫ్ చంద్రబాబును కూడా కోరారు. మద్దతు కోరుతూనే వారిపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కేఏ పాల్ విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్‌ బరస్ట్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రధాని అవుతారనే విదేశీయులు ఈ కుట్ర చేశారని, అందులో భాగంగానే క్లౌడ్ బరస్ట్ జరిగిందని కేసీఆర్ కామెంట్స్ చేశారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో కూడా పారాసిటమాల్ వేసుకోవాలని తేలిగ్గా కేసీఆర్ చెప్పడం వల్ల ఎంతో మంది చనిపోయారని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న అప్పుల వల్ల దేశం త్వరలోనే శ్రీలంక, వెనిజువెలా మారడం ఖాయమని కేఏ పాల్ విమర్శించారు. హైదరాబాద్‌లో తాను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దానిని గుజరాత్‌లో పెట్టాలంటూ బీజేపీ నేతలు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. ఆగస్టు 15వ తేదీలోగా పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

నాకు స్పెషల్ పర్మిషన్లు ఇవ్వలేదు - పాల్
ప్రపంచంలో ఎక్కడ విపత్తులు సంభవించినా సహాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని కేఏ పాల్ గుర్తు చేసుకున్నారు. భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో వస్తున్న వరదల్లో సాయం చేయాలంటే తనకు తగిన పర్మిషన్లు లేవని చెప్పారు. ఎక్విప్‌మెంట్‌ను తన ఫ్లైట్‌లో రానివ్వడం లేదని, తన ఎఫ్‌సీఆర్ఏను ఓపెన్ చేయనివ్వలేదని, హ్యామానిటేరియన్ ఎయిడ్ విదేశాల నుంచి తేవడానికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వనందువల్ల ఇక్కడ ఆదుకోలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala 121 Kg Gold Donation: శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత వర్థమాన్ జైన్ - ఈయన ఎవరంటే?
శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత వర్థమాన్ జైన్ - ఈయన ఎవరంటే?
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
YS Sharmila vs K Kavitha: ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
YS Sharmila vs K Kavitha: ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Embed widget