JC Prabhakar Reddy : ఉయ్యాలవాడ విగ్రహాన్ని అడ్డుకుంటున్న దద్దమ్మ ప్రభుత్వం - మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ !
Uyyalawada : ఉయ్యాలవాడ విగ్రహ ఆవిష్కరణ వివాదంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రెడ్డి ఎమ్మెల్యేలకు సిగ్గులేదా అని ప్రశ్నించారు.
![JC Prabhakar Reddy : ఉయ్యాలవాడ విగ్రహాన్ని అడ్డుకుంటున్న దద్దమ్మ ప్రభుత్వం - మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ ! JC Prabhakar Reddy responded to the Uyyalawada Statue unveiling controversy JC Prabhakar Reddy : ఉయ్యాలవాడ విగ్రహాన్ని అడ్డుకుంటున్న దద్దమ్మ ప్రభుత్వం - మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/10/06e96ffcef25567fcaba37236594d7231704890634374228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Uyyalawada Statue unveiling controversy : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ ను అడ్డుకోవడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఆవిష్కరణ అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నాపు, రాయలసీమ నడిబొడ్డున కర్నూలు కొండారెడ్డి బురుజు పై ఉరితీసిన నర్సింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదన్నారు. అనంతపురం జిల్లాలో ఇంత మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు.... మీరంతా ఏం చేస్తున్నారు.... సోమవారం లోపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే నేనే వచ్చే ఆవిష్కరించుతానని సవాల్ చేశారు.
ఊర్ల నిండా ఎవరెవరో విగ్రహాలు పెడుతున్నారు కానీ ఈ ప్రాంత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే రెడ్ల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కు అల్టిమేటమ్ జారీ చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ లేదని ఆపిన కలెక్టర్ అన్న విగ్రహాలకు పర్మిషన్ ఉందా అంటూ కలెక్టర్ ను ప్రశ్నించారు జేసి ప్రభాకర్ రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దుస్థితిలో ఉన్నారు అనంతపురం జిల్లాలోని రెడ్డి ఎమ్మెల్యేలు.... ఇది సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.
గతంలో తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం ఏర్పాటు చేశారు. రహదారి మధ్యలో ఏర్పాటు చేశారు. రహదారిపై విగ్రహ ఏర్పాటుకు ఆయనేమన్నా స్వాతంత్ర్య సమరయోధుడు కాదని విగ్రహం ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా కలెక్టర్ లెక్కచేయలేదని జేసీ అప్పట్లో ఆందోళన చేశారు. ఇప్పుడు ఉయ్యవాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని అడ్డుకోవడాన్ని.. జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)