అన్వేషించండి

AP Elections 2024: హీరో సాయి తేజ్‌పై రాళ్ల దాడి, స్పందించిన జనసేన పార్టీ

Janasena: ఈ ఘటనలో జన సైనికుడు శ్రీధర్ తలకు గాయం అందని. .ఈ ఘటన బాధాకరం అని ప్రకటనలో జనసేన పార్టీ పేర్కొంది. శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని జనసేన పార్టీ తెలిపింది.

Janasena Responds over attack on Sai Dharam Tej: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా నటుడు సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు సాయి ధరమ్ తేజ్ పై దాడి చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది. సాయి ధరమ్ తేజ్ పై దాడి ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. వైసీపీ మార్కు రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనలో జన సైనికుడు శ్రీధర్ తలకు గాయం కావడం బాధాకరం అని.. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని జనసేన పార్టీ తెలిపింది.

‘‘పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిప్రత్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో శ్రీ సాయి ధరమ్ తేజ్ గారిపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేసే ప్రయత్నానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ మూకలు విసిరిన గాజు ముక్కలు తగిలి స్థానిక జన సైనికుడు శ్రీధర్ తలకు తీవ్రమైన గాయం కావడం చాలా బాధాకరం. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. జనసేన పార్టీ ర్యాలీ సందర్భంలో వైసీపీ రౌడీలు ఘర్షణ వాతావరణం సృష్టించి జన సైనికులను భయాందోళనలకు గురి చేసేందుకు రాళ్లు, గాజు సీసాలు విసిరే ప్రయత్నం చేశారు. 

జనసేన పార్టీ చేస్తున్న ర్యాలిలోకి వైసీపీ రౌడీ మూకలు చొచ్చుకొని రావడం, వైసీపీ జెండాలు ప్రదర్శిస్తూ జన సైనికులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా స్థానిక పోలీస్ అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం..? వైసీపీ మార్కు రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేది లేదు. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులను కోరుతున్నాం’’ అని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget