అన్వేషించండి

జనసైనికుల ‘పవన్ మాల’- కఠిన నియమాలతో దీక్ష!

పవన్ కల్యాణ్‌పై అభిమానంతో జనసైనికుల వినూత్న రీతిలో అభిమానాన్ని వ్యక్తీకరించేందుకు సిద్ధమయ్యారు. పవన్ మాల పేరుతో దీక్ష చేయనున్నారు. 

మండలం రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ.. దైవ చింతనతో గడపడం కోసం భక్తులు మాలధారణ చేస్తారు. దక్షిణాదిలో అయ్యప్ప మాలకు ఎంతో విశిష్టత ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది భక్తులు ఏటా అయ్యప్పమాల వేసుకుంటారు. నలుపు రంగు వస్త్రాలు ధరించి.. 41 రోజులపాటు నిష్టగా పూజలు చేసి.. శబరిమల వెళ్లి హరిహరసుతుణ్ని దర్శించుకొని వస్తారు. అయ్యప్ప మాలతోపాటు.. భవానీ దీక్ష, శివమాల, వేంకటేశ్వర స్వామి మాల, హనుమాన్ దీక్షను కూడా చాలా మంది భక్తులు చేపడుతుంటారు. అదే తరహాలో పవన్‌ మాల. 

వినూత్న రీతిలో అభిమానం..

ఇప్పుడు తెలుగు నాట మరో ట్రెండ్ మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవన్ మాల’ పేరిట దీక్ష స్వీకరించారు. మెడలో ఎర్ర కండువా ధరించి 49 రోజుల దీక్షను మొదలు పెట్టారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. ఇది ఆయన 49వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ మాలధారణ చేసిన ఆయన అభిమానులు 49 రోజులపాటు దీక్ష చేస్తున్నారు. 2018 డిసెంబర్ నెలలో తొలిసారి పవన్ మాల అనే కాన్సెప్ట్‌ను అభిమానులు ప్రారంభించారు. పవన్ ఫ్యాన్స్ అప్పటి నుంచి ఈ మాల దీక్షను కొనసాగిస్తున్నారు.

అభిప్రాయాన్ని మార్చేలా..

పాలకొల్లుకు చెందిన యువకులు పవన్ మాల ధరించారు. వీరంతా మెడలో ఎర్ర కండువాలు ధరించారు. జనసేనాని ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ 49 రోజులు ప్రయత్నిస్తామని వారు తెలిపారు. పవన్ అభిమానులకు దూకుడు ఎక్కువ అనే పేరుంది. కానీ పవన్ మాలధారణ చేసిన వీళ్లంతా.. ఆ అభిప్రాయాన్ని మార్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. తమ వల్ల పవన్ కళ్యాణ్‌కు మంచి పేరు వచ్చేలా చూస్తామని చెబుతున్నారు.

పవన్ మాలధారణ..

పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ మాల వేసుకోవడం ఇదే తొలిసారి కాదని అంటున్నారు. మూడు, నాలుగేళ్ల క్రితం కూడా ఆయన అభిమానులు మాలధారణ చేశారు. సంప్రదాయ వస్త్రధారణ, మెడలో ఎర్ర కండువా, మెడలో రుద్రాక్ష మాల, భుజాన జనసేన జెండాతో.. కాళ్లకు చెప్పులు లేకుండా.. వారు దీక్ష చేశారు. అన్ని మతాలకు చెందిన దేవుళ్ల ఫొటోల మధ్య పవన్ కల్యాణ్ ఫొటో ఉంచి జనసేనానిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అలా ఆ దీక్షను విరమించారు. 

పవన్‌కూ భక్తి ఎక్కువే!

ఇదిలా ఉంచితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సైతం భక్తి ప్రతులు ఎక్కువనే సంగతి తెలిసిందే. 20 ఏళ్లుగా చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది కూడా గత నెలారంభంలో చాతుర్మాస్య దీక్షను ప్రారంభించారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో పవన్ ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలో ఉన్నంత కాలం పవన్ ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. అది కూడా సాత్వికాహారమే తీసుకుంటారని పవన్ అభిమానులు పలు సందర్భాల్లో వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget