అన్వేషించండి

Sonia To Idupulapaya : ఇడుపులపాయకు సోనియా, రాహుల్ వస్తున్నారా ? నిజం ఎంత ?

వైఎస్ జయంతికి సోనియా, రాహుల్ ఇడుపులపాయ వస్తారని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Sonia To Idupulapaya :  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇడుపులపాయకు వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వారి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇడుపులపాయకు  వచ్చారని చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఎనిమిదో తేది. ఇటీవల షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని దానికి సంబంధించిన ప్రకటన ఇడుపులపాయలోనే వస్తుందని చెబుతున్నారు. కానీ ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం అలాంటి సమాచారం ఏమీ మీడియాకు ఇవ్వడం లేదు. అలాంటి కార్యక్రమం ఉన్నట్లుగా ఎలాంటి సమాచారం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

ఇడుపుల పాయకు సోనియా రావడం లేదన్న చింతామోహన్                              
  
 ఏపీ కాంగ్రెస్ నేతలకు కూడా ఎలాంటి సమాచారం లేరు. ఇడుపులపాయకు సోనియా వస్తుందన్న- ప్రచారం అంతా అవాస్తవమేనని ఏపీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చింతా మోహన్ ప్రకటించారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే మంచిదేనన్నారు. అయితే ఆమెకు అంతహైప్ ఇవ్వాల్సిన పని లేదు.. రాజశేఖర్ రెడ్డినిప్రజలు ఎప్పుడో మర్చిపోయారని ఆయనంటున్నారు. 

షర్మిల పార్టీ విలీనం ప్రచారంతో సోనియా ఇడుపుల పాయ రాక వార్తలు                                        

వైఎస్ చనిపోయిన తర్వాత వారి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీతో విభేదించి .. వైసీపీ ని పెట్టుకున్నారు. అప్పట్నుంచి  వైఎస్ జయంతిని కూడా కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇటీవల జగన్ కుటుంబంలో వివాదాలు ప్రారంభం కావడంతో  షర్మిల సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నట్లుగాప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ అవసరం అయితే తెలంగాణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సేవలను కూడా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల కర్ణాటకకు చెందిన కొంతమంది ఆ పార్టీ నేతలు ఆ దిశగానే షర్మిలతో చర్చలు జరిపినట్లు సమాచారం.  

ఏపీలో రాజకీయం చేయాలంటున్న కాంగ్రెస్ - తెలంగాణలోనేనంటున్న షర్మిల                                            

అయితే కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను తెలంగాణలో కాకుండా ఏపీలోనే రాజకీయాలు చేయాలని సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం .. వైసీపీకి నష్టం జరగకుండా ఏపీలో మాత్రం రాజకీయాలు చేయాలనుకోవడం లేదని చెబుతున్నారు. తెలంగాణకే పరిమితమవుతానని వాదిస్తున్నారు. అలా అయితే .. షర్మిల పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కు సలహా ఇస్తున్నారు. ఆమె వల్ల తెలంగాణ పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget