News
News
X

AP CID At Narayana House : నారాయణ ఇంటికి సీఐడీ అధికారులు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ

AP CID At Narayana House : మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ విచారిస్తుంది. హైదరాబాద్ లోని నారాయణ నివాసంలోని విచారణ చేస్తున్నారు అధికారులు.

FOLLOW US: 

AP CID At Narayana House : హైదరాబాద్ లోని మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో అవకతవకలపై సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11.30 నుంచి సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోంది.  సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నారాయణకు ఇప్పటికే సీఐడీ నోటీసులు ఇచ్చింది.  నారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారని,  ఇటీవల ఆయన శస్త్రచికిత్స చేసుకున్నారని సీఐడీ విచారణకు హాజరు కాలేరని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అయితే నారాయణను హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలోనే విచారించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేయనుంది సీఐడీ.  

రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా సీఐడీ చేర్చింది. 120బి, 34, 420, 36, 37, 166 సెక్షన్ల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదులో 2014-19 మధ్య అమరావతి రాజధాని భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో మార్పుతో రామకృష్ణ హోసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది చేకూరేలా చేశారని ఆరోపించారు. ఈ కేసులో నారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  అయితే ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

పదో తరగతి పేపర్ల లీక్ కేసు 
 
టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో  నారాయణకు కింది కోర్టు ఇచ్చిన  బెయిల్‌ను  చిత్తూరు జిల్లా కోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో చిత్తూరు జిల్లాలోని నెల్లేపల్లి హైస్కూల్ లో లీకైన టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో దర్శనమిచ్చింది. దీని వెనుక నారాయణ హస్తం ఉన్నట్టు చిత్తూరు జిల్లా పోలీసులు ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనను కోర్టులో హాజరు పర్చగా, నారాయణ 2014లోనే నారాయణ సంస్థల అధినేతగా తప్పుకున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిల్ ను చిత్తూరు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దు చేసింది.  నవంబరు 30వ తేదీ లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. 

News Reels

నారాయణపై కక్ష సాధింపు 

అసలు ఇన్నర్ రింగ్‌రోడ్డే లేదని ఇక అలైన్‌మెంట్ మార్పు ఎక్కడిదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క గజం కూడా భూసేకరణ జరగని ప్రాజెక్టులో అవకతవకలు ఏమిటని ప్రశ్నిస్తోంది. అలాగే టెన్త్ పేపర్ లీక్ కాలేదని ప్రభుత్వం చెబుతూ.. నారాయణపై లీక్ కేసులు పెట్టడం ఏమిటని  ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం తీరుపై న్యాయస్థానాల్లో ఎండగడతామని టీడీపీ అంటోంది. 

Published at : 18 Nov 2022 03:04 PM (IST) Tags: AP CID Ex Minister Narayana TDP AP Govt inner ring road master plan

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !

Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !

వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్- 22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్

వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్-  22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

టాప్ స్టోరీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Bilkis Bano: సుప్రీం తీర్పుని సవాల్ చేసిన బిల్కిస్ బానో, రిట్ పిటిషన్ దాఖలు

Bilkis Bano: సుప్రీం తీర్పుని సవాల్ చేసిన బిల్కిస్ బానో, రిట్ పిటిషన్ దాఖలు