అన్వేషించండి

లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత, రాళ్లు రువ్వుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

పశ్చిమగోదావరి జిల్లా నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.


పశ్చిమగోదావరి జిల్లా నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  భీమవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  గునుపూడి రాకముందే... వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. గునుపూడి వంతెన వద్ద వైసీపీ జెండాలు ఊపుతూ...రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అధికార పార్టీ కార్యకర్తలు. అనంతరం వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తలకు గాయాలయ్యాయి. పాదయాత్ర ఇందిరమ్మ కాలనీకి చేరుకోగానే వైసీపీ వర్గానికి చెందిన కొందరు వైసీపీ జిందాబాద్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టిడిపి వర్గీయులు జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో ముగ్గురు పోలీసులతో పాటు స్థానిక ప్రజలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారందర్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

అల్లరిమూకలు రాళ్ల దాడి చేస్తున్నా పోలీసులు నిలువరించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమపై రాళ్లదాడి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్‌ కాన్వాయ్‌ లో పలు వాహనాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అల్లరి మూకలు పాదయాత్ర జరిగే ప్రాంతంలోని భవనాలపైకి ఎక్కి...టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. దీంతో పలువురు యువగళం కార్యకర్తలకు గాయాలయ్యాయి. పాదయాత్రలో రాళ్ల దాడిపై లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేరు గ్రామంలో వైసీపీ దాడి, పోలీసుల తీరుకు నిరసనకు దిగారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలు జెండాలు ఊపుతుంటే...పోలీసులకు రక్షణ కల్పించారని మండిపడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
AP BJP leader: కదిరి కూటమిలో కాక రేపుతున్న విష్ణువర్థన్ రెడ్డి హౌస్ అరెస్ట్ - దేవుడి దర్శనానికీ అడ్డంకులేనా?
కదిరి కూటమిలో కాక రేపుతున్న విష్ణువర్థన్ రెడ్డి హౌస్ అరెస్ట్ - దేవుడి దర్శనానికీ అడ్డంకులేనా?
Save Keyans Advik: ఏపీలో మరో ఎస్‌ఎంఏ కేసు! 16 కోట్ల ఇంజెక్షన్‌ కోసం కేయాన్స్ అద్విక్ ఎదురు చూపు!
ఏపీలో మరో ఎస్‌ఎంఏ కేసు! 16 కోట్ల ఇంజెక్షన్‌ కోసం కేయాన్స్ అద్విక్ ఎదురు చూపు!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Honda Dio 125 కొనబోతున్నారా? స్టాండర్డ్, X ఎడిషన్, DLX వేరియంట్ల ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు
హోండా డియో 125 స్కూటర్‌ వేరియంట్లు, ధరలు ఇవే - ఏ మోడల్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
సైకిల్ తొక్కుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందే ఇక్కడ!
సైకిల్ తొక్కుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందే ఇక్కడ!
Embed widget