అన్వేషించండి

AP high Court: ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ

Akiveedu Ram Temple: ఆకివీడులోని పెదపాడు రామాలయ పునర్నిర్మాణం అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేయవద్దని స్పష్టం చేసింది.

Akiveedu Ram Temple Raghurama :  పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపాడు  రామాలయ పునర్నిర్మాణం  అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గత కొన్ని రోజులుగా స్థానికంగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన ఈ వివాదంపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి కూల్చివేతలు గానీ, కొత్త నిర్మాణ పనులు గానీ చేపట్టవద్దని కోర్టు స్పష్టం చేసింది.

 రామాలయమా? గ్రామ దేవత గుడినా?                                              

ఆకివీడు పెదపేటలోని ఒక పురాతన కట్టడం చు ట్టూ ఈ వివాదం మొదలైంది. ఒక వర్గం అది  శ్రీరాముడి ఆలయమని , శిథిలావస్థకు చేరిన ఆ కట్టడాన్ని తొలగించి కొత్తగా భవ్యమైన రామాలయాన్ని నిర్మించాలని పట్టుబట్టింది. అయితే, స్థానిక దళిత సామాజిక వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అది తమ గ్రామ దేవత అయిన  గొంతెనమ్మ ఆలయమని, దశాబ్దాల క్రితం అక్కడ రాముడి విగ్రహాలను కూడా ప్రతిష్టించారని, కానీ ఇప్పుడు ఆ కట్టడాన్ని కూల్చివేసి పూర్తిగా రామాలయంగా మార్చడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనని వారు వాదిస్తున్నారు.

 రంగంలోకి రఘురామకృష్ణంరాజు.. రాజకీయ సెగ                                   

ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  రఘురామకృష్ణంరాజు  ఈ ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను భుజాన వేసుకోవడంతో ఈ వివాదం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఆయన స్వయంగా విరాళాలు సేకరించడం ప్రారంభించగా, ఒక్కరోజులోనే సుమారు 40 లక్షల రూపాయల నిధులు సమకూరాయి. అయితే, ఇటీవల శ్రీరామనవమి పర్వదినాన ఆయన ఆలయ సందర్శనకు వెళ్లినప్పుడు ఒక వర్గం ఆయనను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల వల్ల పోలీసులు అక్కడ 144 సెక్షన్‌ను కూడా విధించాల్సి వచ్చింది.

 హైకోర్టు ఆదేశాలు - అనుమతులు తప్పనిసరి                          

ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, మతపరమైన కట్టడాల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఏ మతపరమైన నిర్మాణం చేపట్టాలన్నా జిల్లా కలెక్టర్ ,  మున్సిపల్ కమిషనర్ అనుమతులు తప్పనిసరని కోర్టు వెల్లడించింది.
అనుమతులు లభించే వరకు ప్రస్తుతం ఉన్న కట్టడాన్ని తాకవద్దని ఆదేశించింది.  రఘురామకృష్ణంరాజు స్వయంగా కోర్టుకు హాజరై, తాము కేవలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభిస్తామని కోర్టుకు విన్నవించారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తి వివరాలతో  కౌంటర్ దాఖలు చేయాలని  ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఆకివీడులో ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడినట్లయింది.            

 

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Breaking News: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget