Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Heavy Rains: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rains Alert To Ap And Telangana: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. ఏపీ వైపు మరో తుపాను దూసుకొస్తోంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు, తెలంగాణలోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారేందుకు ఛాన్స్ ఉందని.. ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా మారొచ్చని.. 17వ తేదీ నాటికి ఆంధ్రాలోనే తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.
ఈ జిల్లాల్లో వర్షాలు
వాయుగుండం తుపానుగా బలపడితే వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటొచ్చని.. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపానుపై క్లారిటీ వస్తుందని చెప్పారు. అటు, పల్నాడు, శ్రీ సత్యసాయి, ఏలూరు, ప్రకాశం, ప.గో జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వెల్లడించారు. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూ.గో, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలోనూ..
అటు, తెలంగాణలోనూ రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కాగా, ప్రతీ ఏడాది అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గత నెలలో వచ్చిన తుపానులు తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. గతంలో పైలిన్, హుద్ హుద్, అంపన్ తుపానులు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Also Read: Andhra News: పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - తక్కువ ధరకే వంట నూనెలు