అన్వేషించండి

Heavy Rains: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు - కోతకు గురైన రహదారులు, గ్రామాలకు రాకపోకలు బంద్

Andhra News: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి.

Rains In AP: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా (Anakapalli District) పాయకరావుపేట నియోజకవర్గంలోని తాండవ, వరాహ నదులు ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాలతో ఎస్.రాయవరం మండలం ఇందేసమ్మ వాగు ఉద్ధృతికి ఘాట్ రోడ్డు కోతకు గురైంది. పట్టణంలోని తాండవ నదికి ఆనుకుని ఉన్న చాకలిపేట ఇంకా ముంపులోనే ఉంది. సత్యవరం వద్ద తాండవ నది వంతెన పైనుంచి వరద ప్రవహించడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించి పరిస్థితి సమీక్షించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని.. వరదలు తగ్గుముఖం పట్టే వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

విష జ్వరాల విజృంభణ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు పూర్థిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో చెత్తాచెదారం భారీగా పేరుకుపోయింది. అపరిశుభ్రత విపరీతంగా పెరిగి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. గత వారం రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది.

త్వరలో 'ఆపరేషన్ బుడమేరు'

అటు, గత కొద్ది రోజులుగా వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరం తేరుకుంటోంది. మంగళవారం సాయంత్రానికి సాధారణ స్థితికి తెచ్చేలా చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని.. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ ఆహారం అందిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, త్వరలో 'ఆపరేషన్ బుడమేరు' చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని.. అక్కడ ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకూ 77 వేల విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించామని.. వరద ప్రాంతాల్లో నీటిని మరో రెండ్రోజులు తాగొద్దని ప్రజలకు సూచించినట్లు పేర్కొన్నారు.

Also Read: Prakasam Barrage Issue : ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు వైసీపీ భారీ కుట్ర - దేశద్రోహమే - ఏపీ హోంమంత్రి తీవ్ర ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Embed widget