(Source: ECI/ABP News/ABP Majha)
Amaravati Case : అమరావతి కేసు డిసెంబర్ కు వాయిదా - ప్రతి వాదులందరికీ నోటీసులివ్వాలన్న సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది. ప్రతివాదులందరికీ నోటీసులు అందించాలని ఆదేశించింది.
Amaravati Case : సుప్రీంకోర్టులో అమరావతి కేసులపై విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు.. వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని కోరిన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయారని వెల్లడించిన అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని కోరిన ఏపీ ప్రభుత్వం కోరింది.
నవంబర్ వరకూ రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నాయన్న ధర్మాసనం
చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించినట్టయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్టేనని తెలిపింది. అయితే ఇంకా మరికొందరికి నోటీసులు అందలేదని చెప్పిన అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ఆదేశించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని అప్పుడే తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది. ఆగష్టు నుంచి నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని స్పష్టం చేసింది. డిసెంబర్‌లోనే విచారణ తేదీలు ఖరారు చేస్తామని తెలిపింది.
అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు
అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రంకోర్టును కోరారు. అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది. గతంలోనే జూలైకు వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. తీర్పుపై స్టే వస్తే రాజధానిని విశాఖ మార్చాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు విచారణ కూడా జరగకుండా డిసెంబర్ కు వాయిదా పడింది.
మూడు రాజధానుల గురించి తమకు తెలియని కేంద్రం అఫిడవిట్
ఇంతకు ముందే కేంద్రం దాఖలు చేసిన అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.