Hamoon Cyclone: బంగ్లాదేశ్ వైపు హమూన్ తుపాను, ఆంధ్రప్రదేశ్‌పై ఎఫెక్ట్ ఇలా
ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ వైపు పర – చిట్టగాంగ్ మధ్య తీరం దాటనుందని వివరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దీనికి హమూన్ అని నామకరణం చేశారు. హమూన్ వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ వైపు పర – చిట్టగాంగ్ మధ్య తీరం దాటనుందని వివరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారింది. దీనికి హమూన్ అని నామకరణం చేశారు. హమూన్ వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ వైపు పర – చిట్టగాంగ్ మధ్య తీరం దాటనుందని వివరించారు.
ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పశ్చిమ బంగాల్, ఒడిశా రాష్ట్రాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఒడిశాపై నేరుగా ప్రభావం ఉండకపోయినప్పటికీ, జాలర్లు ఎవరూ బుధవారం దాకా వేటకు వెళ్లొద్దని అధికార యంత్రాంగం సూచించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు తుపాను సూచికగా.. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ హమూన్ తుపాను భారత తీరంపై అంతగా ప్రభావం ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ తీరం వెంబడి కూడా తక్కువ ప్రభావం ఉంటుందని వెల్లడించింది. సోమవారం సాయంత్రం నాటికి 5:30 గంటలకు ఒడిశాలోని పారాదీప్‌కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని ధిగాకు 360 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని హెపుపరాకు 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ గుర్తించింది.