Pawan Kalyan : ఇద్దరు ఎంపీలతో మొదలై కేంద్రంలో అధికారం, జనసేన ప్రస్థానం కూడా అంతే - పవన్ కల్యాణ్
Pawan Kalyan : కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేని ప్రభుత్వాలు నిలబడవన్నారు.
Pawan Kalyan : దేశంలో మతం, కులం ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక వీర మహిళల రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ తరగతులను ఆ పార్టీ నేత నాగబాబు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ, టీఆర్‌ఎస్‌కి ప్రజలు అవకాశం ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏర్పడే ప్రభుత్వాలు నిలబడవని స్పష్టం చేశారు. దేశంలో మత ప్రస్తావన లేని ప్రభుత్వాలు రావాలన్నారు. దేశంలోని భాష, యాసను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయవాదం రాదని పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం వచ్చే వరకు బీజేపీ పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఏ పార్టీ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పురుషుల ఆధిక్యమే ఉందని, కానీ జనసేనలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రేపు ప్రారంభం కానున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమం గురించి వివరించిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) July 2, 2022
"జనవాణి జనసేన భరోసా" కార్యక్రమం జులై 3న ప్రారంభం. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు..
వేదిక : మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం, విజయవాడ#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/RZILeAB4nr
అందుకే తెలంగాణ ఉద్యమం
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలకు రాజకీయ అవగాహన, పునఃశ్చరణ తరగతులు ప్రారంభించారు. శిక్షణ తరగతులకు హాజరైన వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి విడతగా కృష్ణా, గుంటూరు జిల్లాలో 5 నియోజక వర్గాలు, విజయవాడ నగర పరిధిలోని క్రియాశీలక సభ్యులు ఈ తరగతులకు హాజరయ్యారు. వీరినుద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఒక తల్లి, బిడ్డలకు కూడా విభేదాలు ఉంటాయన్నారు. అలాగే విభిన్నమైన ప్రాంతాలు, కులాల నుంచి ఒక చోటుకు వచ్చి ఒకేలా ఆలోచించాలంటే కష్టసాధ్యమన్నారు. తమ భాష, యాసను గౌరవించడం లేదనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకరి భాష, యాసను మరొకరు గౌరవించాలని పవన్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న విధ్వంసాన్ని సరిచేస్తూ అభివృద్ధి చేయాలన్నారు. ఇద్దరు ఎంపీల నుంచి ఇక్కడి వరకు బీజేపీ పోరాటం చేసిందన్నారు. ఏ పార్టీ ప్రారంభమైనా చిన్నగానే ఉటుందని స్పష్టం చేశారు. జనసేన ప్రస్థానం కూడా అంతే అని తెలిపారు.
జనవాణి జనసేన భరోసా
రేపు విజయవాడలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం గురించి జనసేనాని పవన్ కల్యాణ్ వివరించారు. "జనవాణి జనసేన భరోసా" కార్యక్రమం జులై 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో కార్యక్రమాని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.