అన్వేషించండి

Balakrishna PA : నందమూరి బాలకృష్ణకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం ! పీఏను ...

బాలకృష్ణ పీఏ డిప్యూటేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కర్ణాటకలో పేకాడుతూ ఆయన దొరికిపోయారు.


హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కు ( MLA Bala krishna  ) పీఏ గా వ్యవహరిస్తున్న బాలాజీ  డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలాజీ 
ఇటీవల కర్ణాటక సరిహద్దులోని బార్ అండ్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వైఎస్ఆర్‌సీపీ ( YSRCP )  స్థానిక నేతలతో కలిసి ఆయన పొరుగు రాష్ట్రానికి వెళ్లి ్మరీ పేకాట ఆడుతున్నారు. అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆయనపై విచారణ జరిపిన ప్రభుత్వం తప్పు చేసినట్లుగా నిర్ధారించింది. ఎమ్మెల్యేకు ( MLA PA ) పీఏగా డిప్యూటేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది.   

బాలాజీ ప్రభుత్వ ఉద్యోగి. బాలకృష్ణ ఆయనను పీఏగా నియమించుకున్నారు. దానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  బాలాజీ ( Balaji ) వయోజనవిద్య సూపర్ వైజర్ గా కొనసాగుతున్న సమయంలో బాలకృష్ణ పీఏ పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఆయన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయులకు ఇతర విధులు ఇవ్వకూడదన్న నిబంధనలు ఉన్నాయి. బాలకృష్ణ పీఏగా వెళ్లడానికి కుదరదు. అందుకే ఆయన తన పోస్టింగ్‌ను  వయోజన విద్యలో సూపర్ వైజర్ గా మార్పించుకుని .. ఆ తర్వాత బాలకృష్ణ వద్ద పీఏగా చేరాడు. చాలా రోజుల నుంచి బాలకృష్ణ పీఏగా నియోజకవర్గంలో వ్యవహారాలు చక్క బెడుతున్నారు. 

బాలకృష్ణ స్థానికంగా ఇల్లు తీసుకున్నప్పటికీ ఎక్కువగా ఉండరు. ఎమ్మెల్యే తరపున వ్యవహారాలన్నీ బాలాజీనే చక్క బెడుతూ ఉంటారు. దీంతో ఆయన ఎమ్మె.ల్యే ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా వైఎస్ఆర్‌సీపీ నేతలతో కలిసి పొరుగు రాష్ట్రంలో పేకాడుతూ దొరికిపోవడం కలకలం రేపింది. అయితే ఆయన అలా దొరికిపోయినప్పటికీ బాలకృష్ణ స్పందించలేదు. ఆ తర్వాత బాలాజీ యధావిధిగా పీఏగా పనులు చక్క బెడుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనను అక్కడ కొనసాగించడానికి సిద్ధంగా లేదు. దీంతో డిప్యూటేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇక నుంచి ఆయన ఎమ్మెల్యే పీఏ గా  కొనసాగేందుకు వీలు ఉండదు. టీచర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ పీఏల వ్యవహారాశైలి వివాదాస్పదమయింది. అప్పట్లో దుమారం రేగడంతో ఆయనను తొలగించి బాలాజీని పెట్టుకున్నారు. ఆయన తీరు కూడా వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు ఏపీగా ప్రభుత్వం ఎవరిని కేటాయిస్తుందో కానీ బాలకృష్ణ పీఏ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

 

టాప్ హెడ్ లైన్స్

Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget