News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ganta On Jagan : ఎప్పుడూ శంకుస్థాపనలేనా - ప్రారంభోత్సవాలేమైనా ఉంటాయా ? సీఎం జగన్‌పై గంటా సెటైర్ !

శంకుస్థాపనల సీఎం అంటూ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు గంటా శ్రీనివాసరావు. ఒక్కటైనా ప్రారంభోత్సవం చేశారా అని ప్రశ్నించారు.

FOLLOW US: 
Share:

Ganta On Jagan :  ఎప్పుడూ శంకుస్థాపనలే కానీ ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క ప్రారంభోత్సవమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివారరావు ప్రశ్నించారు. విశాఖలో ఇనార్బిట్ మాల్ కు శంకుస్థాపన చేయడంతో పాటు విశాఖ నగరంలో మొత్తం రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. ఈ విషయంపైనే గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేసారు.     

  నాలుగున్నారేళ్లలో కొత్తగా వచ్చిన కంపెనీ ఒక్కటీ లేదు. ఒప్పందం చేసుకున్న కంపెనీలు రివర్స్ పాలనతో పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి పోయాయ్. ఇక ఉద్యోగాలేమొస్తాయ్. ఆదాయం ఏం వస్తుంది. అయినా ఏముందిలే అప్పులు చేసి బ్రతికేయగలరు కదా...! అని ఎద్దేవా చేశారు.  మీరు ముఖ్యమంత్రి అయ్యాక అప్పు చెయ్యని నెల.. ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీలు తాకట్టు పెట్టని మంగళవారం ఒకటి కూడా లేదు కదా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో చివరి సంవత్సరంలో హడావుడిగా నిన్న విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్థాపన దగ్గర నుంచి చూస్తే... ఈ సంవత్సరం మే 3న భోగాపురం విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన.. ఇదే సంవత్సరం మే 22న మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన... ఇదే సంవత్సరం ఫిబ్రవరి 15న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గత సంవత్సరం జులై 20న రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన.... ఇలా ప్రతి కార్యక్రమం కూడా శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెడుతూ వారిని మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.                                

చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన వాటికి మీరు మళ్ళీ రెండో సారి శంకుస్థాపన పేరుతో హడావుడి చేసి ఆ రోజు తెచ్చిన పలుగు, పార, తట్ట కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజుకి మీరు శంకుస్థాపన చేసిన ఏ ఒక్క చోటు కూడా ఒక్క చిన్న ఇటుక కూడా వెయ్యలేదు మ‌డ‌మ తిప్ప‌డం మాట త‌ప్ప‌డం మా ఇంటావంటా లేద‌ని విశ్వ‌స‌నీయ‌త అనే పదానికి నేను "పేటెంట్" అని చెప్పుకుని తిరుగుతున్నారు కదా. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి కానీ దైర్యం కానీ ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క చిన్న ప్రాజెక్టు అయిన పూర్తి చేసి ప్రారంభించామని మీరు కానీ మీ నాయకులు కానీ నిర్భయంగా ఆధారాలతో ప్రజలకు చూపించగలరా...?’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.                      

Published at : 02 Aug 2023 04:54 PM (IST) Tags: AP Politics Ganta Srinivasa Rao CM Jagan Ganta's criticism of Jagan

ఇవి కూడా చూడండి

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

Andhra Pradesh: న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

Andhra Pradesh: న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

TTD News: అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మ‌ల‌య‌ప్ప స్వామి

TTD News: అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మ‌ల‌య‌ప్ప స్వామి

Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు

Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు

Central Team Inspection: సీఎం జగన్ లెక్కలు తేల్చడానికి కేంద్రం బృందం, రేపే రాష్ట్రానికి రాక!

Central Team Inspection: సీఎం జగన్ లెక్కలు తేల్చడానికి కేంద్రం బృందం, రేపే రాష్ట్రానికి రాక!

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత