అన్వేషించండి

Ram Gopal Varma: జగన్ పాలనపై చర్చకు సిద్దం, పవన్ కల్యాణ్‌కు ఆర్జీవీ సవాల్

Andhra Pradesh News: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆర్జీవీ సవాల్ విసిరారు. తననతో చర్చకు రావాలని పిలుపునిచ్చారు.

YSRCP Government: వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిపై తాను చర్చకు సిద్దమని ప్రతిపక్షాలకు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సవాల్ చేశారు. జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని, ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం జగన్‌కు అనుకూలంగా ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఇప్పటికే విడుదల అవ్వగా.. శపథం సినిమా ఈ నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్బంగా విజయవాడలో ఈ సినిమాలకు సంబంధించి ఈర్జీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాల ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కించానని, జగన్ అంటే ఏమిటో వీటి ద్వారా తెలుస్తుందని అన్నారు.  జగన్ గురించి తాను నమ్మిన నిజాలను ఈ సినిమాలో చూపించానని, కేవలం ఆయన గురించి తన అభిప్రాయాల ఆధారంగా సినిమా తెరకెక్కించిన్లు ఆర్జీవీ స్పష్టం చేశారు.

వైఎస్ వివేకా హత్యను కూడా ప్రస్తావించా

ఈ సినిమాలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావించినట్లు రాంగోపాల్ వర్మ తెలిపారు. ఈ సినిమాలో ఎన్నో అంశాలు ఉంటాయన్నారు. జగన్ సీఎం కాకుండా చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ పన్నిన కుట్రలను చూపించానని, వాటిని ఎదుర్కొని జగన్ ఎలా ఎదిగారనేది సినిమాలో ఉంటుందని తెలిపారు. శపథం సినిమాను 8న థియేటర్లలో విడుదల చేయాల్సి ఉందని, కానీ  ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయడం లేదని వెల్లడించారు.  శపథం ఆరంభం, శపథం అంతం పేరుతో ఓటీటీలో వెబ్‌సిరీస్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. శపథం ఛాప్టర్ 1ను మార్చి 7 సాయంత్రం ఎనిమిది గంటలకు, శపథం అంతంను మార్చి 8న సాయంత్రం 8 గంటలకు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా పే పర్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఆ తర్వాత త్వరలో మిగతా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లలో కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు. అన్ని నిజాలను శపథంలో చూపిస్తామన్నారు. 

సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్

వ్యూహం, శపథం సినిమాల అసలు వ్యూహం సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్ తీయడం అని, కానీ సెన్సార్ బోర్డు నుంచి అనుమతులు రాలేదన్నారు. దీంతో సెన్సార్ బోర్డు నుంచి అనుమతించిన వచ్చిన వెర్షన్‌ను మాత్రమే థియేటర్లలో విడుదల చేయడం జరుగుతుందన్నారు. మిగతా వెర్షన్లను ఓటీటీలో రిలీజ్ చేస్తామన్నారు. ఫిబ్రవరి 23న వ్యూహం, మార్చి 1న శపథం సినిమా రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు, హైకోర్టు నుంచి అడ్డంకులు రావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి సెన్సార్ బోర్డు, హైకోర్టు నుంచి అనుమతి రాకవడంతో సినిమాలను విడుదల చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల వేళ ఈ సినిమాలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నారా లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. వీరి కామెంట్లకు ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget