అన్వేషించండి

Pastor Abhinay Darshan Controversies: మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో

Abhinay Darshan Fake Pastor :పాస్టర్ అభినయ్ దర్శన్ వ్యక్తిగత జీవితంలోని వివాదాలు, మూడు పెళ్లిళ్లు మరియు పాత కేసుల పూర్తి వివరాలు. ఆధ్యాత్మిక ముసుగులో సాగుతున్న ఆయన అసలు కథనం ఇక్కడ చదవండి.

Pastor Abhinay Darshan Dark Side: తనపై తాను దాడి చేయించుకుని హాట్ టాపిక్‌గా మారిన పాస్టర్ అభినయ్ దర్శన్ పాతకథలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలు, మూడు పెళ్లిళ్లు, భార్యకు  వేధింపులు సలా ఆయన చరిత్ర చాలా ఉంది. 

హిందూ, క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన అభినయ్  దర్శన్ గత చరిత్రను తవ్వి తీస్తుంటే బయటపడుతున్న నిజాలు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆధ్యాత్మిక వేదికలపై ఆయన ఇచ్చే ప్రసంగాలకు, తెరవెనుక ఆయన నడిపే వ్యవహారాలకు అస్సలు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.        

అభినయ్ దర్శన్ కేవలం ఒక మతబోధకుడు మాత్రమే కాదు, ఆయన గతంలో సినిమా రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అభినయ్ అనే పేరుతో సినిమాల్లో నటించి, వెండితెరపై మెరవాలని కలలు కన్నారు.  మాయాజాలం అనే సినిమా  తీశారు. ఆ సినిమా ఏమయిందో ఎవరికీ తెలియదు. అయితే అక్కడ ఆశించిన గుర్తింపు రాకపోవడంతో, తర్వాతి కాలంలో  దర్శన్ గా మారి ఆధ్యాత్మిక బాట పట్టారు. సినిమాల్లో పండని గ్లామర్, రాజకీయ వేదికలపై దొరకని మైలేజీని ఈ  డివైన్  వేదికల ద్వారా సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రసంగాల్లో ఉండే నాటకీయత, హావభావాలు అన్నీ సినిమా రంగానికి సంబంధించినవేనని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. తర్వాత అదే పద్దతిలో రాజకీయంపై కన్నేశారు. 

ఈ పాస్టర్ మామూలోడు కాదు అని చెప్పడానికి ఆయన మూడు పెళ్లిళ్ల  వ్యవహారమే నిదర్శనం.  క్రైస్తవ గురువుగా ఉంటూ క్రమశిక్షణ గురించి బోధించే అభినయ్, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస వివాదాలతో సావాసం చేస్తున్నారు. మొదటి భార్య ఉండగానే మరో వివాహం చేసుకోవడం, ఆపై ఆమెతోనూ గొడవలు పడి మూడో పెళ్లి కూడా చేసుకుననారు.  దేవుడు క్షమిస్తాడు అనే సాకుతో తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ, మహిళలను మోసం చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  

కేవలం వ్యక్తిగత వివాదాలే కాదు, అభినయ్ దర్శన్ చుట్టూ అనేక పాత కేసులు , ఆర్థిక ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రార్థన మందిరాల నిర్మాణం పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆ సొమ్ముతో అత్యంత ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.   

పోలీసులు ఇప్పుడు అభినయ్ దర్శన్ గురించి మొత్తం వెలుగులోకి తెస్తున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఇప్పుడు దాడి నాటకం ఆడారు.. తెర వెనుక ఎవరున్నారన్నది మొత్తం తేల్చనున్నారు.                      

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?

Embed widget