అన్వేషించండి

Actor Ali : ఆశల పల్లకీలో అలీ - వైసీపీ అధినేత చాన్సిస్తారా ?

YSRCP : నటుడు అలీ కి సీఎం జగన్ ఎంపీ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు నటుడిగా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉండటంతో రాయలసీమలో అయినా సీటిస్తారని అంటున్నారు.

CM Jagan will give MP ticket to actor Ali  : సినిమాల్లో మంచి పేరు సంపాదిచిన అలీకి ప్రజాప్రతినిధి కావాలని గట్టి కోరిక. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. కానీ పోటీ చేసే చాన్స్ రాలేదు. ఈ సారి సీఎం జగన్ అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఆయనకు ఎక్కడా అవకాశం లేదు. కానీ ఎంపీ సీటుకు చాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఓ మైనార్టీకి చాన్సివ్వాలని అనుకుంటున్న జగన్..  అలీ పేరును పరిశీలనలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. 

రాజమండ్రికి చెందినప్పటికీ ఆయనకు యాక్టర్ గా రాష్ట్రం మొత్తం గుర్తింపు ఉంది. అందుకే  నంద్యాల పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం ఆయన పేరును  పరిశీలిస్తోందని చెబుతున్నారు.  రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఆరు దఫాలుగా సీట్ల మార్పు చేర్పులు చేసింది. అందులో 70 అసెంబ్లీ స్థానాలు, 18 ఎంపీ స్థానాలు ప్రకటించింది. ఇంకా 105 అసెంబ్లీ స్థానాలు, 7 ఎంపీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలు న్నాయి. అయితే అధిష్టానం జనవరి 11న మూడో జాబితాలో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని మంత్రి కొంత కాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. సీటు విషయంపై అధిష్టానం ఎంత ప్రయత్నించినా మంత్రి అందుబాటులోకి రాకపోవడంతో కర్నూలు జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ బీవై రామయ్యకు కేటాయించింది.                      

ఇక మిగిలిన నంద్యాల పార్లమెంట్ స్థానంపై ఉత్కంఠ వీడడం లేదు. అభ్యర్థి ప్రకటన విషయంలో వైసీపీ అధిష్టానం ఆలస్యం చేస్తోంది. సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు. అధిష్టానం మాత్రం ఆయన పట్ల సానుకూలంగా స్పందించ లేదు. ఎంపీకి పలు సర్వేలు అనుకూలంగా  లేవని చెబుతున్నారు. . ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు చెప్పుకోదగ్గ ప్రజా కార్యక్రమాలు చేయలేదు. అలాగే తన పార్లమెంట్ పరిధిలో కనీసం సొంతంగా బలమైన క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోకపోవడం ఈయనకు మైనస్ గా మారింది.                

ఎంపీ రేసులో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, సినీ నటుడు అలీ, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అధిష్టానం సినీ నటుడు అలీ కి గాని, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ భాషలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆలీ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.   మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని, ఆయనకు నంద్యాల పార్లమెంట్ టికెట్ ఇవ్వనుందనే ఉద్దేశంతో ఆయన చేరిక కోసం వైసీపీ అభ్యర్థి పేరును ఖరారు చేయలేకపోతుందని చెబుతున్నారు. అయితే అంతిమంగా అలీకే ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా అంచనా  వేస్తున్నారు.                                         

టాప్ హెడ్ లైన్స్

Breaking News: శ్రీశైలంలోని సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలంలోని సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Pratibha Takadapally:
"పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్
Irumudi Collection: వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ 400: మీకు సరిగ్గా సరిపోయే బైక్ ఏది?
హంటర్ 350 vs స్పీడ్ 400.. రూ.63,000 డిఫరెన్స్‌! పవర్, ఫీచర్లు, బ్రేకుల్లో ఏ బైక్‌ బెస్ట్‌?
Embed widget