అన్వేషించండి

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?

PM Modi Chandrababu Meeting: ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, సీఆర్ పాటిల్, పియూష్ గోయల్‌లతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. పోలవరం, అమరావతి, విశాఖ మెట్రోపై పలు కీలక అంశాలపై చర్చించారు.

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర ముఖ్య మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన హామీలు, మౌలిక వసతుల కల్పన, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్, విశాఖ బీచ్ కారిడార్ మరియు కేంద్రం నుంచి రావాల్సిన వివిధ ఆర్థిక సహాయాలపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు లోతుగా చర్చించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్రం అందిస్తున్న నిరంతర సహకారానికి ప్రధానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.  

ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేవలం ప్రధానితోనే కాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితి, కేంద్ర-రాష్ట్ర సమన్వయం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు  ,   రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలపై అమిత్ షాతో చర్చలు జరిపారు. ఏపీ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన హోంశాఖ, కేంద్రం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చింది.

అలాగే, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయి రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత సమయానికి పూర్తి చేసేందుకు నిధుల విడుదల వేగవంతం చేయాలని, రూ. 30,000 కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార  పనులకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వీటికి తోడు, గోదావరి-కావేరి అనుసంధానంతో పాటు దక్షిణ భారతదేశంలోని ఐదు ప్రధాన నదుల  గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి  అనుసంధానంపై సీఆర్ పాటిల్‌కు సవివరమైన ప్రణాళికను అందించారు.

పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.   నవంబర్ 12–13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల ప్రాతినిధ్యాన్ని ఆహ్వానించారు. మరోవైపు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై జాతీయ రహదారుల విస్తరణ, విశాఖ-భోగాపురం బీచ్ కారిడార్ మరియు వివిధ ఎక్స్‌ప్రెస్ వేల అనుమతులపై విజ్ఞప్తులు సమర్పించారు.   

  సీఎం చంద్రబాబు జరిపిన ఈ రెండ్రోజుల హస్తిన పర్యటన ఏపీ ప్రయోజన సాధన దిశగా అత్యంత సానుకూలంగా సాగింది. ప్రధానమంత్రి మోదీ మొదలుకొని కీలక శాఖల కేంద్ర మంత్రుల వరకు అందరితో జరిపిన చర్చలు రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల నిధుల సమీకరణకు కొత్త ఊపునిచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
AP Investment Protection Act: పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
Embed widget