అన్వేషించండి

Chandrababu Jayaho BC : బీసీలను నిరుపేదలుగా మార్చిన జగన్ - వారి మళ్లీ పూర్వ వైభవం - చంద్రబాబు హామీ

Jayaho BC : బీసీలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జయహో బీసీ ద్వారా వారికి మళ్లీ పూర్వ వైభవం తెస్తామన్నారు.

Chandrababu : నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి.. అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు. ఆదాయం పెంచే మార్గాలను సూచించానని బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో ఆయన మాట్లాడారు. జయహో బీసీ ( JayahoBC )కోసం 40 రోజుల ప్రణాళిక రూపొందించామని, పేదల ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. జయహో బీసీ లక్ష్యాలను లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేలా టీడీపీ ( TDP ) ప్రణాళిక ఉంటుందని చంద్రబాబు తెలిపారు.                                 

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామని చంద్రబాబు అన్నారు. 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశామని తెలిపారు. 125 కులాలకు ఆర్థికసాయం చేసిన పార్టీ టీడీపీ అన్నారు. కార్పొరేషన్ల ద్వారా రూ.3,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన జగన్ నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్‌ ఇచ్చారా? అని బాబు ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి? ఆయన ప్రశ్నించారు. రూ.వందల కోట్ల విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసిందన్నారు. వాటిని తుప్పు పట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదని బాబు విమర్శించారు.             

వైసీపీ ప్రభుత్వం రాగానే 34 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారని చంద్రబాబు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను రద్దు చేశారన్నారు. కనీసం బీసీ భవనాలను కూడా పూర్తిచేయలేకపోయారన్నారు. మూడు రాజధానులు కాదు.. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని.. దాన్ని పూర్తి చేసి తీరుతామని బాబు అన్నారు. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారని చంద్రబాబు నిలదీశారు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు చెప్పారు. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి.. వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారన్న విషయాలను సదస్సు ద్వారా టీడీపీ తెలియజేస్తోందని తెలిపారు.   గతంలో బీసీ చెంతకు వచ్చే ధైర్యం చేయకూడదనే బీసీ రక్షణ చట్టం పెట్టామని తెలిపారు.              
 
టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జయహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని... జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించామని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. చెత్తపై కూడా సీఎం జగన్ పన్ను వేశారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలు విచ్చలవిడిగా పెంచారని మండిపడ్డారు.       

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Chandra Babu On Ravan: రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget