అన్వేషించండి

Chandrababu : రాష్ట్రం కోసమే నాడు బీజేపీతో విభేదించాం - 52 రోజుల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం - ఇంకొల్లులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

TDP: 52 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ నేతల్ని వేధించిన ఎవర్నీ వదిలి పెట్టేది లేదన్నారు.

Chandrababu Inkollu Sabha Speech :  ఎన్నికలకు ముందు ఏపీకి నాలుగో రాజదాని అంటున్నాని.. జగన్ పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో నిర్వహించిన రా .. కదలి రా బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు.  

బీజేపీతో విబేధించింది రాష్ట్రం కోసమే ! 

అమరావతి పూర్తయితే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేది.  ఆనాడు బీజేపీతో విభేదించింది ప్రజల కోసం.. రాష్ట్రం కోసమే. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు. కేంద్రం సాయం చేస్తామన్నా.. తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని జగన్ చెప్పాడా, లేదా? అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అన్నాడా లేదా? అని ప్రశ్నించారు. గెలిచాక ఎందుకు మాట మార్చావ్? అని నిలదీశారు.  "ఆ తర్వాత మూడు రాజధానులు అన్నాడు... ఇప్పుడు మళ్లీ  హైదరాబాద్ ను నాలుగో రాజధాని అంటున్నాడు అని ఎద్దేవా చేశారు. బిచ్చమెత్తుకుంటే ఎవరైనా ఆస్తిలో వాటా ఇస్తారా? హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మేం నష్టపోయాం, మేం చేతకాని వాళ్లం. పనికిరానివాడు ముఖ్యమంత్రి అయ్యాడు. మేం మళ్లీ వస్తాం... ఓ పక్కన ఉంటాం అంటే ఒప్పుకుంటారా?" అని ప్రశ్నించారు. 

52 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం 

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. మరో 52 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ఏం జరుగుతుందో ఆలోచించి మరీ ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటం మా కోసం కాదు... మీ పిల్లల భవిష్యత్  కోసం... ఓటేసే ముందు ప్రతి విషయంపై మనసు పెట్టి ఆలోచించాలని సూచించారు. ఎన్నికల ముందే తమ విజయం ఖాయమైందని చంద్రబాబు స్పష్టం చేశారు.   వైనాట్ పులివెందుల అనేదే తమ నినాదం అని పేర్కొన్నారు. జగన్ కు అభ్యర్థులు దొరక్క దిక్కుతోచని స్థితిలో పడ్డారని చంద్రబాబాబు ఎద్దేవా చేశారు. జగన్... రాజకీయాలను కలుషితం చేశారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు వద్దు... గౌరవప్రదమైన రాజకీయాలు చేయడం నేర్చుకో అని హితవు పలికారు. 

టీడీపీ నేతలపై వేధింపులు 

పోలీసుల అండతో అక్రమ మైనింగ్ చేపడుతున్నారని... ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ పైనా కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో తాను, పవన్ కల్యాణ్ సహా అందరం బాధితులమేనని అన్నారు. దోపిడీకి అడ్డం వచ్చిన వారిపై కేసులు, వేధింపులు పెరిగాయని తెలిపారు. పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారు.   సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నోటీసులో ఏం ఉందో చూడకుండా సభ ఆపాలని ఎస్పీ అంటారా అని ప్రశ్నించారు.  మనం చట్ట ప్రకారం వెళ్తున్నాం.. అడ్డం వస్తే తొక్కుకుని పోతాం. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైంది. పర్చూరు నియోజకవర్గంలో గ్రానైట్‌ వ్యాపారులపై లు కేసులు పెట్టించి వేధించారు. మైనింగ్‌ అధికారులు  వైసీపీ మూకలతో వెళ్లి వ్యాపారులను బెదిరించారు. అధికారం ఉందని ఆంబోతుల మాదిరిగా ఊరు మీద పడ్డారు. గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారు.  

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ 

మాట్లాడితే జగన్‌ బటన్ నొక్కానని చెబుతున్నారు. అందుకే ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. చెత్త, నీరు, ఆస్తిపై పన్నులు పెంచారు. మద్యపాన నిషేధం, జాబ్‌ క్యాలెండర్‌పై జగన్‌ ఎందుకు బటన్‌ నొక్కలేదు. జగన్‌ పెట్టే ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉంటుంది. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Central assistance: ప్రకృతి వైపరీత్యాల సహాయం - ఏపీ సహా 6 రాష్ట్రాలకు రూ.1,930 కోట్ల అదనపు నిధులు
Central assistance: ప్రకృతి వైపరీత్యాల సహాయం - ఏపీ సహా 6 రాష్ట్రాలకు రూ.1,930 కోట్ల అదనపు నిధులు
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Madhavi Latha Iftar Flexis: MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CNG Shortage In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
LPG Gas Booking : గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
MG Comet EVకి పోటీగా Tata Punch EV ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం.. ఫీచర్లు, రేంజ్ పూర్తి వివరాలు
MG Comet EVకి పోటీగా Tata Punch EV ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం.. ఫీచర్లు, రేంజ్ పూర్తి వివరాలు
Embed widget