అన్వేషించండి

Chandrababu : నియోజకవర్గ ఇంచార్జుల పనితీరుపై చంద్రబాబు సమీక్ష - వర్గాలున్న చోట్ల పార్టీ నేతలతో చర్చలు !

పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉండే విబేధాలను పరిష్కరిస్తున్నారు.


Chandrababu :  చంద్రబాబునాయుడు ఓ వైపు రాష్ట్ర పర్యటనలు చేస్తూనే పార్టీ అభ్యర్థులపై పూర్తి స్థాయి కసర్తుత  చేస్తున్నారు. అసెంబ్లి ,పార్లమెంటు అభ్యర్ధులను దసరా నాటికి ఖరారు చేయాలని  భావిస్తున్నారు. దసరాకి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల ప్రధాన మ్యానిఫెస్టోతో పాటు 70 నుంచి 75 మంది అభ్యర్దులను ప్రకటించాలన్న భావనలో ఆ పార్టీ ఉంది.నియోజకవర్గాలలో నేతలు ముందస్తుగానే పని చేస్తే గెలుపు తధ్యమన్న దీమాలో ఉన్న అధినాయకత్వం ఈ క్రమంలోనే అభ్యర్ధుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. 

నియోజకవర్గాల్లో పోటీ ఉన్న  చోట్ల చంద్రబాబు ప్రత్యేక దృష్టి

కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఉంది. టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. మరికొన్ని చోట్ల కొత్తగా పార్టీలోకి చేరకలు జరుగుతున్నాయి.  కొత్త, పాత నేతల మధ్య సమన్వయం , నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధిపత్య పోరుకు కళ్ళెంవేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.  నేతల మధ్యల అంతరాలను, విభేదాలకు చెక్‌ పెట్టి తద్వారా పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.  పొత్తులు ఉన్నా లేకున్నా ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేసి అధికారం కైవసం చేసుకోవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఆర్ధిక, అంగబలం ఉన్న నేతలతో పాటు కొత్త వారికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు టీడీపీ అధినేత. 

ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించే ఆలోచన              

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందస్తుగానే అభ్యర్దులను ప్రకటించాలని  పార్టీ అధినేత అనుకుంటున్‌నారు.  నియోజకవర్గాల వారీగా నేతల పని తీరుపై ఓ కన్నెసిన అధిష్టానం ఇప్పుడు సర్వేలను మొదలుపెట్టింది. గతంలో చేసిన సర్వే నివేదికలు, పార్టీ వ్యూహకర్తలు ఇచ్చిన సమాచారం, ప్రస్తుతం సేకరించిన వివరాల ఆధారంగా అభ్యర్దుల కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో స్దానిక ప్రజల నాడీ, క్యాడర్‌కు అనుగుణంగా ఉన్న నేతలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో ఈ మేరకు మార్పులు, చేర్పులు చేసిన అధిష్టానం ఇప్పుడు తాజాగా సర్వేలు నిర్వహిస్తూ నివేదికలను తయారు చేస్తోంది. 

గెలుపు గుర్రాలకే అవకాశం                   

చంద్రబాబు గతంలో ప్రజల్లో ఉన్న పలుకుబడితో పాటు పార్టీపట్ల విధేయంగా ఉన్నారన్న సానుభూతితో పాటు ఇతరులు తెచ్చే ఒత్తిళ్లు ఇతర అంశాల ఆధారంగా టిక్కెట్లుఖరారు చేసేవారు. ఈసారి కేవలం పని తీరు, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఆధారంగా టిక్కెట్లు ఇస్తామని ఎటువంటి ఒత్తిడికి లొంగేది లేదని తేల్చి చెబుతున్నారు.  గతంలో మాదిరిగా చివరి నిమిషంలో అభ్యర్దులను ఖరారు చేయకుండా ఈ సారి ముందస్తుగానే ఎంపిక చేయాలని భావిస్తున్నారు. సర్వే రిపోర్టులు , పార్టీ వ్యూహకర్తల నివేదికలను కూలంకుషంగా పరిశీలిస్తూ అభ్యర్ధుల వడపోత కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. బలమైన అభ్యర్దులను రంగంలోకి దింపి సత్తా చాటాలన్న యోచన లో ఆ పార్టీ అధినేత ఉన్నారు.            

టాప్ హెడ్ లైన్స్

RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Chandra Babu On Ravan: రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget