అన్వేషించండి

Steel Plant Sale : రాజకీయం కోసమే లక్ష్మినారాయణ పిటిషన్..! స్టీల్ ప్లాంట్ అమ్మేసే అధికారం ఉందన్న కేంద్రం..!

స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ప్రధాని నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుందని.. హైకోర్టులో జోక్యం చేసుకోకూడదని కేంద్రం అఫిడవిట్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని.. అది చట్టబద్ధమైన అధికారాలతో తీసుకున్న నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు తెలిపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ న్యాయపోరాటం చేస్తున్నారు.  ఏపీ హైకోర్టులో ఆయన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని.. ఇలాంటి నిర్ణయాలపై విచారణ తగదని అఫిడవిట్‌లో తెలిపింది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. 

అదే సమయంలో.. పిటిషన్ దాఖలు చేసిన వీవీ లక్ష్మినారాయణకు కేంద్రం రాజకీయ ఉద్దేశాలు అంటగట్టింది. ఆయన రాజకీయ లబ్ది పొందడానికే పిటిషన్ వేశారని ఆరోపించింది. ఆయన పిల్‌కు విచారణార్హత లేదని కొట్టి వేయాలని కోరింది. అయితే కేంద్రం చెప్పినట్లుగా వీవీ లక్ష్మినారాయణ రాజకీయ లబ్ది పొందడానికి .. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేరు. గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పటికీ.. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి.. సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. రైతులు, వ్యవసాయం ఇతర అంశాలపై ఆయన అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయన ఇంకా.. రాజకీయాల్లో ఉన్నారని అనుకుందేమో కానీ... రాజకీయలబ్ది కోసం పిటిషన్ వేశారని ఆరోపించేసింది. కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. 
 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వీవీ లక్ష్మినారాయణ చురుగ్గా పాల్గొంటున్నారు. ఉద్యమకారులకు మద్దతు తెపుతున్నారు. మొదట్లోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో అనేక కీలకమైన అంశాలను పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్రం విశాఖ ఉక్కుపై 5 వేల కోట్లు ఖర్చు చేసిందని.. కానీ 30 వేల కోట్లు టాక్స్ రూపంలో వసూలు చేసిందని లక్ష్మినారాయణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ను ప్రభుత్వరంగంలో కొనసాగిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం.. వీవీ లక్ష్మినారాయణ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై స్పందించలేదు. స్టీల్ ప్లాంట్ దేనికి అమ్ముతున్నారో... అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుందో.. అసలు ఎంత ఖర్చు పెట్టారు.. ఎంతకు అమ్ముతున్నారన్నదానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. కానీ.. అమ్మడానికి అధికారం ఉందని మాత్రం తేల్చి చెబుతోంది. అమ్మే అధికారం ఉందని అమ్ముతున్నాం కానీ..  అసలు అమ్మాల్సిన అవసరం ఏమిటనేది.. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో లేకపోవడం.. చర్చనీయాంశం అవుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
YSRCP Political Plan: ఓ వైపు అమరావతి - మరో వైపు మత మార్పిళ్లు- వైఎస్ఆర్‌సీపీ స్వయం శిక్షలు దేని కోసం!?
ఓ వైపు అమరావతి - మరో వైపు మత మార్పిళ్లు- వైఎస్ఆర్‌సీపీ స్వయం శిక్షలు దేని కోసం!?
Railwaykoduru Crime News: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Abhishek Sharma: SRH స్టార్ అభిషేక్ శర్మపై క్రమశిక్షణ చర్యలు ! ఫీజులో కోత, డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చిన బీసీసీఐ!
SRH స్టార్ అభిషేక్ శర్మపై క్రమశిక్షణ చర్యలు ! ఫీజులో కోత, డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చిన బీసీసీఐ!
Bandla Ganesh : బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి - కాబోయే అల్లుడిని ఇంట్రడ్యూస్ చేసిన ఫేమస్ ప్రొడ్యూసర్
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి - కాబోయే అల్లుడిని ఇంట్రడ్యూస్ చేసిన ఫేమస్ ప్రొడ్యూసర్
Biker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Embed widget