అన్వేషించండి

CBI To YS Avinash Reddy : అవినాష్ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ - మళ్లీ ఎప్పుడు రావాలని చెప్పిందంటే ?

తమ ఎదుట హాజరయ్యేందుకు సీబీఐ మరో తేదీని అవినాష్ రెడ్డికి ఇచ్చింది. 19న హాజరు కావాలని ఆదేశించింది.


CBI To  YS Avinash Reddy :    వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి 19వ తేదన తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. వాస్తవానికి ఇవాళే ఆయన సీబీఐ ఎదుట రాజరు కావాల్సి ఉంది. కానీ తనకు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చివరి క్షణంలో అవినాష్ రెడ్డి లేఖ రాశారు. నాలుగు రోజుల పాటు రాలేనని చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. 19వ తేదీన హాజరు కావాలని ఆదేశించారు. 

నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాలున్నాయన్న అవినాష్ రెడ్డి                           

వైఎస్ అవినాష్ రెడ్డి హాజరువుతారని ఉదయం వరకూ ప్రచారం జరిగింది.  ఆయన నిన్ననే  పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చారు.  ఉదయం నుంచి సీబీఐ కార్యాలయం వద్ద పులివెందల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు గుమికూడారు.  అయితే   చివరి క్షణంలో అవినాష్ రెడ్డి ఆగిపోయారు. తాను విచారణకు రాలేనని మరో నాలుగు రోజుల సమయం కావాలని ఆడిగారు.  ముందుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉన్నందున రాలేనంటున్నారు.  ఇలా సీబీఐ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ కు హాజరు కాకపోవడం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా ప్రతీ సారి ఇదే సమాధానం ఇచ్చారు. కొన్ని సార్లు కోర్టులకు వెళ్లారు. ఈ కారణంగానే  అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు కూడా చెప్పింది. 

అరెస్ట్ చేస్తారని అవినాష్ రెడ్డి అనుకుంటున్నారా ? 
     
 అరెస్టులకు ఎలాంటి ఆటంకాలు లేకపోయినప్పటికీ సీబీఐ ఇంకా .. అవినాష్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ వివేకా హత్య కేసులో  సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి కీలక అంశాలు తీసుకెళ్లింది.  వివేకా హత్య కేసు వెనుక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ పాత్రపైన ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వివరించింది. గుండెపోటు అంటూ హత్యను దాచిపెట్టటం, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలో అవినాష్ భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి, తప్పుదోవ పట్టించారని వివరించింది. దీంతో కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు నివేదించింది. 

ఆరు సార్లు అవినాష్‌ను విచారించిన సీబీఐ

 హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడ ఉందన్నది కస్డడీ లో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది, హత్య తరువాత 2019 మార్చి 15వ తేదీ తెల్లవారు జామున 1.58 గంటలకు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు గుగూల్ టేక్ ఔట్ ద్వారా తేలిందని సీబీఐ కోర్టుకు వివరించింది. అవినాశ్‌ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని... ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. అందుకే విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారేమోనని అవినాష్ రెడ్డి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికి ఆరు సార్లు ఎంపీ అవినాష్ సీబీఐ ముందు హాజరయ్యారు. ఇప్పుడు ఏడో సారి హాజరు కావాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Helicopter Tours Controversy: ప్రజాధనంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ హెలికాప్టర్ టూర్స్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు
ప్రజాధనంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ హెలికాప్టర్ టూర్స్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
TMC symbol frozen : మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Embed widget