అన్వేషించండి

AP Caste census: నవంబర్ నుంచి ఏపీలో కులగణన-ఆరు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళిక

ఏపీలో కులగణన జరగబోతోంది. నవంబర్ 15 తర్వాత రాష్ట్రంలో కులాల వారీ సర్వేకు సిద్ధమవుతోంది జగన్‌ సర్కార్‌. ఆరు నెలల్లో కులగణన పూర్తి చేయాలని భావిస్తోంది.

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతోంది. కులగణనకు కూడా శ్రీకారం చుడుతోంది. కులగణన.. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనాభా లెక్కలతోపాటు కులగణన చేయాలని పలు పార్టీలు, సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా రాష్ట్రం కులగణన చేయాలని నిర్ణయించుకుంది. నవంబర్‌ 15 తర్వాత రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జగన్‌ సర్కార్‌. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. 

రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 15 తర్వాత రాష్ట్రమంతటా ఈ సర్వే మొదలుపెట్టేందుకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. వాలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ద్వారా ఈ సర్వే చేపడతారు. సచివాలయాల ఉద్యోగులు ఆయా సచివాలయాల పరిధిలో ఉండే ఇంటింటి వివరాలు సేకరిస్తారు. కులగణన సర్వీలో వాలంటీర్లను దూరం పెట్టనున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో.. వాలంటీర్లను కులగణలో భాగస్వామ్యులను చేయడం లేదని సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మాత్రమే ఈ సర్వేలో పాల్గొంటారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. దీని కోసం ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. 

కులగణన పారదర్శకంగా జరగాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు. అందుకోసం మూడు స్థాయిల్లో పునఃపరిశీలన జరిగేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సేకరించిన వివరాలను మండలస్థాయిలో అధికారులు రీవెరిఫికేషన్ చేస్తారు. సచివాలయ పరిధిలోని 10 శాతం చొప్పున ఇళ్లల్లో ఈ రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ద్వితియస్థాయిలో రీ వెరిఫికేషన్‌ బాధ్యతలను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు అప్పటించింది జగన్‌ సర్కార్‌. ఇక.. మూడో స్థాయిలో.. కింది స్థాయిలో జరిగిన సర్వేపై ఆర్‌డీవో ఆధ్వర్యంలో వెరిఫికేషన్‌ ఉంటుంది.

కులగణన కోసం ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న యాప్ ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. అధికార యంత్రాంగం ఆ పనిలోనే ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. 

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కులగణన అమల్లో ఉంది. బిహార్ ప్రభుత్వం మొదటగా దీన్ని చేపట్టింది. ఆ తర్వాత పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా కులాల వారీగా సర్వే చేపట్టాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఆ జాబితాలో చేరుతోంది. ఏపీలో ప్రత్యేకంగా కులగణన చేపట్టేందుకు సీఎం జగన్‌ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఇప్పుడు.. నవంబర్‌ 15న తర్వాత కులగణన చేపట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. దీని కంటే ముందు... అంటే నవంబర్‌ 15 కంటే ముంద.. రాష్ట్రంలోని కుల సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం. వారి సలహాలు సూచనలు కూడా తీసుకోబోతుంది. 

ఆంధ్రలో నవంబర్ 15న కులగణల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాదు.. ఆరు నెలల్లోనే కులగణన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

టాప్ హెడ్ లైన్స్

AP Helicopter Tours Controversy: ప్రజాధనంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ హెలికాప్టర్ టూర్స్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు
ప్రజాధనంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ హెలికాప్టర్ టూర్స్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
Trump Tariffs On India: ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
IIT Bombay Incident: ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆ*త్మహత్య!
ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య!
Toughest Opponent Pick: కోహ్లీ, రోహిత్ కాదు ఆ ఇండియన్ బ్యాటర్ చుక్కలు చూపించాడు.. దిగ్గజ బ్యాటర్‌పై ఆసీస్ కెప్టెన్  కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
కోహ్లీ, రోహిత్ కాదు ఆ ఇండియన్ బ్యాటర్ చుక్కలు చూపించాడు.. దిగ్గజంపై ఆసీస్ కెప్టెన్  కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల బ్రహ్మోత్సవాలు 2026: మాయామోహ విమోచనం మోహిని రూపం, మాయామోహాన్ని అధిగమించి భగవంతుని శరణు పొందాలనే సందేశం!
తిరుమల బ్రహ్మోత్సవాలు 2026: మాయామోహ విమోచనం మోహిని రూపం , మాయామోహాన్ని అధిగమించి భగవంతుని శరణు పొందాలనే సందేశం!
Embed widget