అన్వేషించండి

Mudragada Vs budda : చంద్రబాబు జోలికి రాకు - ముద్రగడకు బుద్దావెంకన్న వార్నింగ్

ముద్రగడ పద్మనాభం రాసిన లేఖకు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.


Mudragada Vs budda :  పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తూ.. చంద్రబాబు ప్రస్తావన కూడా లేఖలో చేసిన  ముద్రగడ పద్మనాభంకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న  మరోసారి కౌంటర్ ఇచ్చారు.   ముద్రగడ గారు మీది పొరపాటా లేక గ్రహపాటా? అని ప్రశ్నించారు.  1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని 1993 – 1994లో ఎలా కలుస్తారు? ‘ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా? అంటూ సెటైర్ వేశారు. 1993 – 1994 లో పత్తిపాడు ఎం.ఎల్.ఏ గా మీరు, ముఖ్యమంత్రిగా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి వున్నారు..మీరు చెప్తున్న కేసులు అప్పుడు మీరు శాసనసభ్యులుగా వున్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులే అని మరిచిపోయారా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

 

 

ముద్రగడ ప్రతి లేఖకూ కౌంటర్ ఇస్తానన్న బుద్దా వెంకన్న
  
అప్పటి విషయం చంద్రబాబు గారికి ఆపాదించడం పొరపాటు కాదా?మీరు ఈ లేఖలతో ఎందుకు జరగని విషయాలను జరిగినట్టు ప్రస్తావిస్తున్నారు?ఎందుకు మీరు చంద్రబాబుని ప్రతివిషయంలో లాగుతారు?అంటూ ప్రశ్నించారు.రాజకీయంగా ఏదన్నా మాట్లాడండి తప్పు లేదు.. కానీ చంద్రబాబు గారికి కులాన్ని ఆపాదించకండి.. ఆయన అన్ని కులాలని సమానంగా చూస్తారు అంటూ పేర్కొన్నారు.  ముద్రగడ రాసే ప్రతీ లేఖలు సమాధానం ఇస్తామంటూ బుద్ధా వెంకన్న కొన్ని రోజుల క్రితం ముద్రగడకు కౌంటర్ ఇచ్చిన సందర్భంగా తెలిపారు. ముద్రగడ దమ్ముంటే నాపై పోటీ చెయ్యి అంటూ మరోసారి పవన్ కల్యాణ్ కు సవాల్ విసురుతు లేఖ రాశారు. దీంతో బుద్దా వెంకన్న ఆయనకు మరోసారి బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారు.

పవన్ కు సవాల్ చేస్తూ ముద్రగడ లేఖ 
 
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ చేసినట్టు పోటీకి సిద్ధం కావాలని పవన్‌కు ముద్రగడ  పవన్ కల్యాణ్‌కు సలహా ఇచ్చారు.  ఏ కారణంతోనైనా అక్కడ చేయబోనని తోక ముడిస్తే పిఠాపురం నుంచి పోటీకి సిద్దపడాలన్నారు. అలా సిద్దపడిన తర్వాత తనకు సవాల్ చేస్తే తాను రెడీ అవుతారని చెప్పుకొచ్చారు ముద్రగడ. ఈ మేరకు పలు ఆరోపణలతో పవన్ పై మళ్లీ లేఖ  రాశారు.  చేగువేరా ఆదర్శం అంటూ చెప్పుకునే పవన్ కల్యాణ్... గుండెల నిండా దైర్యం ఉంటే రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. జనసైనికులు బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టినంత మాత్రాన తాను భయపడి పోయి లొంగిపోయే ప్రసక్తి లేదన్నారు. డోంట్ కేర్ అంటూ... ఎప్పటికీ మీ మోచేతి కింద నీళ్ళు తాగడం లేదని తాగబోనని చెప్పారు.  

కులాన్ని తాకట్టు పెట్టేసినట్లుగా విమర్శిస్తున్నారన్న ముద్రగడ

ఎప్పుడూ తాను పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదని అయినా తనను కాకినాడ ఎమ్మెల్యేలను తిట్టిపోశారని విమర్శించారు ముద్రగడ. అలా ఫ్యాన్స్‌తో తిట్టించడం వల్ల మీరు పెద్ద హీరో అనుకుంటున్నరాని... సినిమాల్లోనే హీరో తప్ప రాజకీయాల్లో కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు.  కులం కోసం తాను ఏమీ చేయనట్టు కులాన్ని ఉపయోగించుకొని ఎదిగినట్టు ఉద్యమాన్ని అమ్మేసినట్టు  దుష్ప్రచారం చేస్తున్నారని ఇవి సినిమా డైలాగ్‌లను మరిపించిందన్నారు. గోచీ, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదన్నారు. దమ్ముధైర్యం ఉంటే నేరుగా తన పేరును ఉపయోగించి మీరే తిట్టాలని పవన్‌కు సవాల్ చేశారు. దానికి తాను సమాధానం చెబుతానన్నారు. కాపుల గురించి ఎప్పుడూ ఆలోచన చేయని పవన్‌ కాపుల గురించి మాట్లాడే హక్కులేదని విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

AP MPTC ZPTC Election Results Live Updates: ఏపీ పరిషత్ ఫలితాలు.. బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం
ఏపీ పరిషత్ ఫలితాలు.. బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం
Botsa Anusha: బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
MPTC ZPTC Election Results: పరిషత్ పోరులో మెజార్టీల రికార్డులు.. పల్నాడులో కూటమి అభ్యర్థుల ప్రభంజనం!
పరిషత్ పోరులో మెజార్టీల రికార్డులు.. పల్నాడులో కూటమి అభ్యర్థుల ప్రభంజనం!
Nagari MPTC Election Result: ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై రోజా కన్నీళ్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నాతో అరెస్ట్!
ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై రోజా కన్నీళ్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నాతో అరెస్ట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget