AP BJP: కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం స్టిక్కర్లు, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు అవుతున్న పథకాలకు, రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింసహరావు అభ్యంతరం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పేరును పెట్టుకుని ప్రచారం చేయటంపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహరంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను కలిసి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింసహరావు ఫిర్యాదు చేశారు.
గవర్నర్ తో జీవీఎల్ భేటీ...
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు అవుతున్న పథకాలకు, రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేస్తుందని ఆయన అభ్యంతరం తెలిపారు. దీని పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఇదే తంతు కొనసాగుతుందని, కేంద్రం నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలకు ప్రచారాలు ఇవ్వం లేదని ఆయన అభ్యంతరం తెలిపారు.
విశాఖ భూములపై రెండు సిట్ లు ఏమయ్యాయి...
విశాఖపట్నం కేంద్రంగా జరిగిన భూ దందాల్లో జరిగిన రెండు సిట్ విచారణల నివేదికలను వెంటనే బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని జీవీఎల్ నరసింహారావు గవర్నర్ ను కోరారు. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కూడ విశాఖపట్నం భూ అక్రమాల పై సిట్ తో విచారణ చేయించారని, అప్పుడు కూడా ఆ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వచ్చిన తరవాత కూడ మరో సిట్ టీం ను ఏర్పాటు చేసి.. విశాఖపట్టణం కేంద్రంగా జరిగిన భూ అక్రమాల పై విచారణ చేయించారని,అది కూడ నివేదికను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహరాల పై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు ఫిర్యాదు చేశామని జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధులు విడుదల....
రాజకీయ లబ్ధి ఆశించకుండా రాష్ట్ర ప్రజల కోసం రెవెన్యూ లోటు భర్తీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేశారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. నరేంద్ర మోడీ కి ప్రత్యేక చొరవతో ఏపికి నిధులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 10 వేల 461 కోట్లు రూపాయలు రెవెన్యూ గ్రాంట్ గా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్కదేశ్ కి కేంద్రం నిధులు ఇస్తుంటే... ఎందుకు ఇస్తున్నారు అని కొందరు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో చూడలేదన్నారు. నరేంద్ర మోడీ రాజకీయ లబ్ది కోసం పని చెయ్యరని,కేవలం ప్రజల కోసం పనిచేస్తారని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిదులు ఇచ్చిన కేంద్రం...
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడు గా ఖర్చు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అప్పులు ఉబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పై ప్రధానికి చాలా సానుకూలంగా ఉన్నారని, పోలవరం ప్రాజెక్ట్ కి అదనంగా 12 వేల 911 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. పోలవరం 41.15 మీటర్ల వరకు తొలి దశ నిర్మాణం కోసం నిధులు కేంద్ర ప్రభుత్యం ఇస్తుందని తెలిపారు. రాష్ట్రం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఛార్జిషీటు ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని, దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను వస్తాయన్నారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం రిలీజ్ చేయనుందని, త్వరలో కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారని అన్నారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని, తొమ్మిదేళ్ల కాలంలో రూ. 55 వేల కోట్ల మేర నరేగా నిధులిచ్చిందని అన్నారు. కేంద్రం ఇచ్చే ప్రధాన పథకాల్లో ఆంధ్రప్రదేశ్ కి చేకూరినంత లబ్ది మరెనరికీ చేకూర్చలేదని జీవీఎల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధులు...
ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ నిరంతరం అండగా ఉంటున్నారని జీవీఎల్ నరసింహరావు అన్నారు. రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారని,స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చారని, ఈ రూ. 10 వేల కోట్లు ఏపీ ప్రజలకు వరంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను గుట్టుగా తెచ్చుకుని తామేదో ప్రజలకు సేవ చేసినట్టు వైసీపీ చెప్పుకుంటోందని అభ్యంతరం తెలిపారు. మేం నిధులివ్వకుంటే వైసీపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. 2016 నుంచి ఇప్పటి వరకు రూ. 16,984 కోట్లు అదనపు రుణం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకున్నాయని తెలిపారు. దీంతో కేంద్రం అప్పులపై పరిమితి విధించిందని చెప్పారు. ఈ ఏడాది కూడా రూ. 8 వేల కోట్లు కోత విధించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మీదట మూడేళ్లల్లో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించిందని వివరించారు. ఈ ఏడాది రూ. 2667 కోట్ల మాత్రమే కోత విధించి.. సుమారు రూ. 5 వేల కోట్ల మేర రుణ వెసులుబాటును కేంద్రం కల్పించిందని తెలిపారు.