అన్వేషించండి

AP BJP Somu : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు - రాజీనామా చేయాలని సోము వీర్రాజుకు హైకమాండ్ నుంచి ఆదేశం

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సోము వీర్రాజుకు హైకమాండ్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడ్ని రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.


AP BJP Somu :  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సోము వీర్రాజుకు బీజేపీ హైకమాండ్ ఆదేశించింది.   నేరుగా సోము వీర్రాజుకు ఫోన్ చేసిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీ పదవి కాలం పూర్తయినందున తప్పించాలని నిర్ణయం తీసుకున్నామని.. రాజీనామా చేయాలని సూచించారు.   దీంతో ఏపీ బీజేపీకి రెండు రోజుల్లో కొత్త అధ్యక్షుడ్ని నియమించే అవకాశం ఉంది.  తనకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారని..  కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. 

ఎన్నికలకు సిద్ధమయ్యేలా బీజేపీ ప్రక్షాళన

వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యేలా పార్టీని , ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసేలా బీజేపీ హైకమాండ్ కొద్ది రోజులుగా విస్తృత మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలో పలువురు బీజేపీ పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించుకుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను మారుస్తారని విస్తృత ప్రచారం జరుగింది కానీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు వీర్రాజును మారుస్తారని పెద్దగా ప్రచారం జరగలేదు. అయితే అనూహ్యంగా ఏపీకి కూడా చీఫ్ ను మార్చాలని హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 

ఎన్నికలు సోము నేతృత్వంలో ఎదుర్కొంటామని గతంలో ప్రకటన

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు. ఆయన పదవి కాలం ముగిసింది. ఆయననే అధ్యక్షుడిగా కొనసాగిస్తామని పార్టీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ గతంలో ప్రకటించారు. నిన్నామొన్నటిదాకా సోము వీర్రాజును తొలగిస్తారన్న ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు.. వచ్చె ఎన్నికల్లో పొత్తుల అంశాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. రాజకీయ సమీకరణఆలు మారాలంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని మార్చాలని డిసైడయినట్లుగా చెబుతున్నారు. 

రేసులో ముందున్న సత్యకుమార్     

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి కోస్తా ప్రాంత నేతలే కొనసాగుతున్నారు. ఈ సారి రాయలసీమ నేతను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కడప జిల్లాకు చెందిన  సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఆయనను బీజేపీ చీఫ్ గా చేస్తే..  బీసీ వర్గాలకు .. అలాగే రాయలసీమకూ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందన్న అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. సత్యకుమార్ కు బీజేపీ హైకమాండ్ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అదే విధంగా సుజనా చౌదరి పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. 

ఏపీ బీజేపీలో సోము కు వ్యతిరేకంగా బలమైన వర్గం            

ఏపీ బీజేపీలో వర్గ పోరాటం కూడా ఉంది. సోము వీర్రాజు వ్య వహారశైలిని ఓ వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు కూడా నిర్వహించారు. కన్నా లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినప్పుడు కూడా సోము వీర్రాజు వ్యవహారశైలి వివాదాస్పదమయింది. ఆయనను ఆపేందుకు ప్రయత్నించలేదని.. హైకమాండ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శలు కొంత మంది నేతలు చేశారు. అదే సమయంలో సోముకు వ్యతిరేకంగా  పెద్ద ఎత్తున నేతలు ఢిల్లీకి కూడా వెళ్లారు. అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియా ముందు  పెట్టవద్దని చెప్పి వారందర్నీ పంపించేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget