కూటమి పొత్తులో భాగంగా బీజేపీ రాష్ట్రంలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలలో బరిలోకి దిగుతోంది. ఇందులో అనంతపురం మేయర్ స్థానం, ఐదు మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
AP Local Body Elections | ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకుగానూ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. అనంతపురం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోట్ల అజేశ్ బాబు బరిలోకి దిగుతున్నారు.

- కూటమిలో భాగంగా బీజేపీ 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలలో పోటీ.
- బీజేపీ తొలి జాబితాలో అనంతపురం మేయర్‌తో ఐదుగురిని ప్రకటించింది.
- మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
- స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 28న జరగనుంది.
BJP Candidates List | అమరావతి: ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీలు వరుసగా అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తున్నాయి. ఇదివరకే టీడీపీ అభ్యర్థుల రెండు జాబితాలు విడుదల చేయగా, జనసేన పార్టీ సైతం కొందరు అభ్యర్థుల జాబితా ప్రకటించింది. తాజాగా శనివారం రాత్రి భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కొన్ని రోజులపాటు కూటమి భాగస్వామ్య పక్షాల నేతల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలతో పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీ రాష్ట్రంలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలలో బరిలోకి దిగుతోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటన ద్వారా అభ్యర్థుల వివరాలు వెల్లడించారు.
తాజాగా విడుదల చేసిన జాబితాలో అనంతపురం మేయర్ స్థానంతో పాటు 5 మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోట్ల అజేశ్ బాబు పేరును ప్రకటించారు. భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోట్ల అజేశ్ బాబు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల చైర్మన్ స్థానాల విషయానికొస్తే.. యలమంచిలి ఛైర్‌పర్సన్‌గా పిల్ల రామా కుమారి, గూడూరు (కే) స్థానానికి దమమ్ సునీతా బాయి, గిద్దలూరుకు డాక్టర్ జాడి వెంకట నారాయణ, నెల్లిమర్లకు మైపాడ ప్రసాద్, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ నుంచి బీజేపీ తరఫున గోర్ల మధులత పోటీ చేయనున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్
అనంతపురం (మేయర్) - కోట్ల అజేశ్ బాబు
మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు
- యలమంచిలి - పిల్ల రామా కుమారి
- గూడూరు (కే) - దమమ్ సునీతా బాయి
- నెల్లిమర్ల - మైపాడ ప్రసాద్
- గిద్దలూరు - డా.జాడి వెంకట నారాయణ
- ఎర్రగుంట్ల - గోర్ల మధులత
మిగిలిన బీజేపీ స్థానాలైన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (మేయర్)తో పాటు బాపట్ల, కావలి మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మిగతా మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా ఆ స్థానాలకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 16న ప్రారంభం కాగా, ఆదివారం (అక్టోబర్ 18) నాడు అభ్యర్థుల దరఖాస్తుకు తుది గడువు ముగియనుందని తెలిసిందే.
అక్టోబర్ 19న నామపత్రాల పరిశీలన చేస్తారు. ఈ 21న అభ్యర్థిత్వాల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదేరోజు పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్, లేక అవసరమైన చోట ఈ 29న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదేరోజు విజేతల వివరాలు ప్రకటించారు.
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది?
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎవరు?
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోట్ల అజేశ్ బాబు పేరును భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ఎప్పుడు?
స్థానిక సంస్థల ఎన్నికలకు అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదేరోజు విజేతల వివరాలు ప్రకటించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఎప్పుడు?
అభ్యర్థుల దరఖాస్తుకు తుది గడువు అక్టోబర్ 18 (ఆదివారం). నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 16న ప్రారంభమైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























