అన్వేషించండి

YS Sharmila: 'అవి ఆత్మహత్యలా, ప్రభుత్వం చేస్తున్న హత్యలా?' - ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి ఏపీసీసీ చీఫ్ షర్మిల సూటి ప్రశ్నలు

AP Politics: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. 'ఛలో సెక్రటేరియట్' నిరసన సందర్భంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

YS Sharmila Slams Ysrcp Government in Vijayawada: ఏపీలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ గురువారం తలపెట్టిన 'ఛలో సెక్రటేరియట్' (Chalo Secratariat) నిరసన కార్యక్రమంలో నేతలను అడ్డుకోవడంతో విజయవాడలో (Vijayawada) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల సహా ఇతర నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఆమె ఆంధ్ర రత్న భవన్ వద్దే బైఠాయించి నిరసన తెలుపుతూ.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చదివిన చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. దాదాపు 21 వేల మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఓ సర్వేలో తేలినట్లు షర్మిల చెప్పారు.

'నిరసన తెలిపితే నేరమా.?'

ఉద్యోగాల భర్తీ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని షర్మిల మండిపడ్డారు. '5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 1.43 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టి దిగిపోయారు. ఆ తర్వాత జగనన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 25 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే.. 7 వేల ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు.? 7 వేల ఉద్యోగాలూ ఇవ్వలేదని చంద్రబాబును నాడు మీరు అడగలేదా.? ఆ మాటలు ఇవాళ మీకు వర్తించవా.? నిరుద్యోగులపై మీకు దయ లేదా.? మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ ఇచ్చారు. పట్టపగలే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వారి కార్యకర్తలకు ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలేవీ.?' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

'ఇన్ని ఆంక్షలు ఎందుకు.?'

టనిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తే పాపమా..? NSUIని గత పది రోజులుగా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఛలో సెక్రెటేరియట్ కు ఇన్ని ఆంక్షలు ఎందుకు..?, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుందా..? జర్నలిస్టులను గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అడ్డుకోవడం ఎంత వరకు న్యాయం. గత రెండు రోజులుగా పోలీసులు హై అలర్ట్ లో ఉండి మమ్మల్ని నియంత్రిస్తున్నారు. పోలీసులను మీరు బంటుల్లా వాడుకుంటారా.? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేము ఆందోళన చేస్తే మీరు నియంత్రియాల్సిన అవసరం ఏముంది.?. జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తామని చెప్పిన జగనన్న.. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా..? ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాబు పోవాలి జాబ్ రావాలన్న నినాదం మీది కాదా.?' అని ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ మెగా డీఎస్సీ వేసి ఉద్యోగాలు భర్తీ చేశారని.. ఆయనకు, జగనన్నకు చాలా తేడా ఉందని అన్నారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడానికి సిగ్గుండాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నవరత్నాలు, జాతిరత్నాలు ఏమయ్యాయని నిలదీశారు. ఐదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంత అడ్డుకున్నా 'ఛలో సెక్రటేరియట్' చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Also Read: Congress Chalo Secratariat: కాంగ్రెస్ 'ఛలో సెక్రటేరియట్' ఉద్రిక్తత - నేతల గృహ నిర్బంధం, ఆంధ్ర రత్న భవన్ వద్దే షర్మిల బైఠాయింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABPKKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Special Trains: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
Sukumar About Suhas: కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
Varalaxmi Sarathkumar: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
YSRCP News Strategy: ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
Embed widget