అన్వేషించండి

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో తుపాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కలెక్టర్ హరి నారాయణన్. కంట్రోల్ రూమ్ లో 1077 కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించామన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈనెల 3వ తేదీనాటికి ఇది తుపాను(cyclone)గా మారి పెను విధ్వంసం సృష్టించే అవకాశముంది. ఈనెల 3, 4, 5 తేదీల్లో తుపాను హెచ్చరికలను భారత వాతావరణ శాఖ(IMD) జారీ చేసింది. తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఏపీలోని తీర ప్రాంతంలోని పలు జిల్లాల్లో కలెక్టర్లు అధికారులను అలర్ట్ చేస్తున్నారు. నెల్లూరు(nellore) జిల్లాలో తుపానుని ఎదుర్కోడానికి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. 

నెల్లూరు జిల్లాలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్.. జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. తుపానుని ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని, తుపాను అనంతరం చేపట్టాల్సిన నివారణ చర్యలకోసం ఇప్పటినుంచే సిద్ధం కావాలన్నారు. ఆర్డీవోలు రెవెన్యూ అధికారులతో, మండల అధికారులతో  సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తుపానుని  ఎదుర్కు నేందుకు సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు. 

కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్.. 
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో తుపాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కలెక్టర్ హరి నారాయణన్. కంట్రోల్ రూమ్ లో 1077 కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించామన్నారు. డివిజన్ కేంద్రాల్లో కూడా శనివారం ఉదయం నుంచి కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు తమ సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇవ్వరాదని, ఎవరు కూడా వారి డివిజన్ హెడ్ క్వార్టర్లు దాటి వెళ్లరాదని ఆదేశించారు. 


Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

జలాశయాలపై పర్యవేక్షణ..
ఇరిగేషన్ అధికారులు సోమశిల, కండలేరు జలాశయాలపై పూర్తి పర్యవేక్షణ ఉంచాలని, ఎప్పటికప్పుడు నీటి నిల్వలను పరిశీలిస్తూ ఉండాలన్నారు కలెక్టర్ హరినారాయణన్. అల్లూరు, కలిగిరి, గండిపాలెం, రాళ్లపాడు, సర్వేపల్లి చెరువుల్లో నీటి ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ, ఉద్యానవన పంటల గురించి తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. చేపల చెరువులకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. 

మత్స్యకారుల వేటపై ఆంక్షలు
మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు కలెక్టర్ హరినారాయణన్. వేటకు వెళ్లిన వారందరూ తిరిగి తీరం చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.లోతట్టు ప్రాంతాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముంపుకి గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పూరిగుడిసెలు ఉన్న ఎస్టీ కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, నాణ్యమైన ఆహారం ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందించాలన్నారు. 

వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కరెంటు లేని సమయంలో కూడా ఐసీయూ, వార్డులు పనిచేసేలా ఇన్వర్టర్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్. ప్రైవేటు వైద్యశాలలో కూడా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆయా తేదీలలో డెలివరీ సమయం ఉన్న వారిని ముందుగానే ఆసుపత్రులకు తీసుకెళ్లాలన్నారు. అన్ని రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలలను క్షుణ్ణంగా పరిశీలించాలని, బలహీన కట్టడాలు ఉన్న బిల్డింగ్ ల నుంచి సురక్షిత ప్రాంతాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా చూడాలన్నారు. ప్రజలందరూ కూడా అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, లేదంటే సురక్షితంగా ఇళ్లలోనే ఉండేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు కలెక్టర్. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ వైర్లు, స్తంభాల ఇబ్బందులు రాకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుకోని సంఘటన జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై అగ్నిమాపక శాఖ అధికారులు సంసిద్ధంగా ఉండాలని, అగ్నిమాపక యంత్రాలు, ప్రొక్లెయిన్లు, ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. రేషన్ సరుకులను త్వరగా పంపిణీ చేయాలన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget