అన్వేషించండి

Breaking News Live Telugu Updates: ఆ హోం గార్డులను విధుల్లోకి తీసుకోండి - సీఎం KCRకు జగ్గారెడ్డి లేఖ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: ఆ హోం గార్డులను విధుల్లోకి తీసుకోండి - సీఎం KCRకు జగ్గారెడ్డి లేఖ

Background

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, నైరుతి రాజస్థాన్, దాని సమీప ప్రాంతాల్లో పశ్చిమ డిస్ట్రబెన్స్ పాక్షికంగా చురుకుగా ఉంటుంది. దీనితో పాటు, దక్షిణ కొంకణ్ మరియు మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ద్రోణి అంటే అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా, మార్చి 6 నుండి 8 వరకు మధ్య భారతదేశంలో తేలికపాటి, మోస్తరు మరియు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 6 నుంచి 9 వరకు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మార్చి 6 నుంచి 7 వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో ఇలా..

ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఇక నుంచి అధిక ఉష్ణోగ్రతల విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ వస్తోంది. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.

 

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం-ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ బులెటిన్‌లో తెలిపారు. 

ఏపీలో ఇలా

ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీలో వడగళ్ల వాన

మంగళవారం (మార్చి 7) ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండగా, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్రల్లో భారీ వర్షాలు, వడగళ్ల వాన కురిసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే 5 రోజుల్లో దేశంలోని వాతావరణంలో గణనీయమైన తేడాలు ఉండవు. మధ్య భారతం, మహారాష్ట్ర, గుజరాత్ మినహా దేశం మొత్తం మీద గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో, మార్చి 8 బుధవారం కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అంచనా. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది.

20:07 PM (IST)  •  08 Mar 2023

చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగలను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్ , రాచకొండ కమీషనరేట్ల పరిధి ఉప్పల్ , మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ల లిమిట్స్ వేర్వేరుగా చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగలను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు ... ఉప్పల్ పీఎస్ లో వివరాలను వెల్లడించిన మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి...

వివరాల్లోకి వెళితే ... ఉప్పల్ పీఎస్ కేసు వివరాలు : 

ఉప్పల్ విజయపురి కాలనీకి చెందిన గంటపంగి జయరాజు (26) వృత్తిరీత్యా ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తుంటాడు ... విలాసవంతమైన రైడ్ లకు అలవాటు పడ్డ జయరాజు పెద్ద సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతాలైన ఉప్పల్ , రామంతాపూర్ , భరత్ నగర్ , నాగోల్ మెట్రో స్టేషన్ లలో వాహనాలను చోరీ చేసి పెట్రోల్ అయిపోయేంత వరకూ తిప్పి వదిలేస్తుంటాడు ... కాగా ఉప్పల్ లో రాజ్యలక్ష్మి థియేటర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద రీతిలో ఉన్న జయరాజు ను అదుపులోకి తీసుకుని విచారించగా , ఉప్పల్ పీఎస్ పరిధిలో ఏడు వాహనాలను దొంగిలించినట్లు దర్యాప్తు లో తేలిందనీ ... దీంతో జయరాజు వద్ద  నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ జేసే ఏడు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి తెలిపారు ...

కాగా జయరాజు పై 2017 లో సెల్ ఫోన్ దొంగతనం కేసు , 2019 లో ఉప్పల్ పీఎస్ పరిధిలో జయరాజు పై పోక్సోచట్టం కింద అరెస్టు అయి జైలుకు వెళ్లినా కూడా పద్దతి మార్చుకోలేదని డిసిపి అన్నారు . 


మల్కాజిగిరి పీఎస్ పరిధి కేసు వివరాలు : 

కుషాయిగూడ పీఎస్ పరిధి హనుమాన్ నగర్ కు చెందిన పంబాల నాగరాజు (30) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ ... చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు . 

హైదరాబాద్ , రాచకొండ పోలీస్ కమీషనరేట్ల పరిధిలోని మల్కాజిగిరి , కుషాయిగూడ , నేరేడుమెట్‌ , బోయినపల్లి పీఎస్ ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు ... 

సిసిటివి కెమెరాల సాయంతో కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ తో హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో కూడా వర్కవుట్ చేయడం వల్ల నిందితుడిని పట్టుకోవడం జరిగిందని డిసిపి తెలిపారు. 

నిందితుడు నాగరాజు వద్ద నాలుగున్నర లక్షల విలువ జేసే రెండు ఆటోలు , అయిదు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి తెలిపారు..

బైట్ :- ధరావత్ జానకి డిసిపి మల్కాజిగిరి.

18:18 PM (IST)  •  08 Mar 2023

ఆ హోం గార్డులను విధుల్లోకి తీసుకోండి - సీఎం KCRకు జగ్గారెడ్డి లేఖ

250 మంది హోం గార్డులను విధుల్లోకి తీసుకోవాలని సిఎం కేసీఆర్ కు లేఖ రాసిన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.

*ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డర్ కాపీ లేదని 250 మంది హోం గార్డు లను విధుల్లో నుండి తొలిగించడం జరిగింది.

*అప్పటికే వారు 10 సంవత్సరాలు వివిధ జిల్లాలో హోం గార్డు గా విధులు నిర్వహించారు.

*ఈ 250మంది  హోం గార్డు లకు ఐడీ, కార్డ్స్, బ్యాంకు అకౌంట్స్,హెల్త్ కార్డ్స్ అన్ని ఉన్నాయి.

* కానీ ఆర్డర్ కాపీ లేదని వారిని విధుల్లో నుండి తొలిగించడం జరిగింది.

* 10 సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

*ఐతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్ గారు ఈ  250మందిని విధులోకి తీసుకుంటామని అసెంబ్లీ లో హామీ ఇచ్చారు.

*కానీ ఎందుకో వారిని విధులోకి తీసుకోవడంలో జాప్యం జరిగింది.

* ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోం గార్డులను విధులోకి తీసుకుంటానని కేసిఆర్ గారు మాట ఇచ్చారు...తీసుకోండి..


* ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అవుతున్న వారిని డ్యూటీ లోకి తీసుకోలేదు.

*అందుకే మీ దృష్టికి మరోసారి తీసుకొస్తూ గుర్తు చేస్తూ లేఖ రాస్తున్న.

* ఈ 250మందిని వెంటనే విధులోకి తీసుకోవాలని కోరుతున్న.

*రేపు జరుగనున్న కాబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న

16:27 PM (IST)  •  08 Mar 2023

ప్రగతి భవన్ కు కాదు నేరుగా ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. మొదట ఆమె ప్రగతి భవన్ కు వెళ్తారని అంతా భావించారు. నేరుగా ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లకుండా నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్నారు. మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగ్రుతి సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు కలిసి నిరాహార దీక్ష చేయాలనుకున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ అయ్యేలా చూడాలని బీజేపీని డిమాండ్ చేయాలని నిర్ణయించాం అన్నారు కవిత.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను ఈ నెల 10న మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా తలపెట్టానని, ఇంతలోనే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని కవిత అన్నారు.

12:42 PM (IST)  •  08 Mar 2023

వైఎస్ షర్మిల అరెస్ట్- దీక్ష భగ్నం చేసిన పోలీసులు

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ట్యాంక్ బండ్‌పై మౌన దీక్షను బగ్నం చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న ఆగాయిత్యాలకు నిరసనగా దీక్షకు దిగారు షర్మిల. 

08:04 AM (IST)  •  08 Mar 2023

CRDA Lands Sale: సీఆర్డీఏ భూముల అమ్మకానికి రెడీ, సమావేశం అయిన కమిటీ

సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూములను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది తుళ్లూరు మండలం పుచ్చుకులపాలెం పరిధిలో దాదాపు 10 ఎకరాలను అమ్మేందుకు రెడీ అయింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి అధ్యక్షతన జేసీ జి.రాజకుమారి, తెనాలి సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ అలీం బాషా, జేడీ(ఎస్టేట్‌) డేవిడ్‌ రాజు, డీఆర్వో చంద్రశేఖర్‌రావు, గుంటూరు ఆర్‌డీవో ప్రభాకర్‌రెడ్డితో కూడిన జిల్లా కమిటీ సమావేశమై చర్చించింది. చినకాకాని- గుండుగొలను విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ వద్ద పదెకరాల భూమి ఎకరం రూ.5,94,50,000గా నిర్ణయించారు. అంతేకాకుండా అమరావతి రాజధానిలోని పిచ్చుకలపాలెం గ్రామానికి ఆనుకొని  ఉన్న భూమి నాలుగు ఎకరాలను ఒక్కో ఎకరం రూ.5,41,04,400కు విక్రయించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget