Breaking News Live Telugu Updates: నాపై అసత్య ప్రచారం చేశారు - సీఎం కేసీఆర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
![Breaking News Live Telugu Updates: నాపై అసత్య ప్రచారం చేశారు - సీఎం కేసీఆర్ Breaking News Live Telugu Updates: నాపై అసత్య ప్రచారం చేశారు - సీఎం కేసీఆర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/105fba8a8bf6b40995c9c1e7fa9a090d1667458576668234_original.jpg)
Background
అర్థరాత్రి హైడ్రామా అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్రగా టీఆర్‌ఎస్, సీపీఐ ఆరోపిస్తోంది. ఓటమి ఖాయమని గ్రహించిన బీజేపీ లీడర్లు ఉపఎన్నిక రద్దు చేసే కుట్రకు తెర తీశారని ఆక్షేపిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు ధ్వజమెత్తుతున్నారు.
మునుగోడు ఉపఎన్నిక రద్దు చేసేందుకు బీజేపీ నేతల కుట్ర పన్నారంటూ ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అర్ధరాత్రి ధర్నాలతో మునుగోడు ఉపఎన్నిక రద్దు చేయించేందుకు బీజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నానికి పూనుకున్నారని ఆక్షేపించారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతో ఘర్షణలను సృష్టిస్తోందన్నారు.
బీజేపీ తాను వేసుకున్న పథకం ప్రకారమే... పలివేలలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్‌తో సహా టీఆరెస్ కార్యకర్తలపై గుండాగిరి చేసిందన్నారు కూనంనేని. అంకిరెడ్డిపాలెంలో జనం, విలేకర్లపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగారని ఆరోపించారు. దాడులు కూడా చేశారన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మునుగోడులో బీజేపీ నేతలు ధర్నాల పేరుతో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ నాయకులు ఇంత హైడ్రామా సృష్టిస్తుంటే.. ఎన్నికల కమిషన్, కేంద్ర పరిశీలకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కూనంనేని. తక్షణమే బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసీ మునుగోడు ఉపఎన్నిక శాంతియుతంగా జరిపించాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.
మునుగోడులో ఓటమి ఖాయమైపోయిందని గ్రహించిన బీజేపీ కొత్త డ్రామాలకు తెరతీసిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి బలం బలగం అపారంగా ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు మునుగోడు నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. మునుగోడులో గెలవలేక... ఓటమి భయంతో దింపుడు కళ్లెం ఆశలతో రాజగోపాల్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజగోపాల్ రెడ్డి తాపత్రయమంతా సానుభూతి పొందేందుకేనన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన ధర్నా కార్యక్రమంతో పోలీసులతో బలవంతంగా అరెస్టు చేపించుకొని సానుభూతి పొందే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డిదని విమర్శించారు.
నాపై అసత్య ప్రచారం చేశారు - సీఎం కేసీఆర్
కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్ లో మీడియో సమావేశంలో మాట్లాడిన ఆయన... తొలిసారి భారమైన మనసుతో మాట్లాడుతున్నా అన్నారు. దేశంలో చాలా ఇబ్బందిక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బీజేపీ చెప్పినట్టు చేస్తేనే ఎన్నికల సంఘం పనిచేసినట్లా? అని ప్రశ్నించారు. దుబ్బాకలో స్వల్ప తేడాతో ఓడిపోయామని, నాగార్జున సాగర్‌లో గెలిచామన్నారు. గెలుపు ఓటములు సహజమన్న కేసీఆర్... ఏదైనా గంభీరంగా స్వీకరించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి తనను కలిసినట్టు దుష్ప్రచారం చేశారని విమర్శించారు.
నాపై అసత్య ప్రచారం చేశారు - సీఎం కేసీఆర్
కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్ లో మీడియో సమావేశంలో మాట్లాడిన ఆయన... తొలిసారి భారమైన మనసుతో మాట్లాడుతున్నా అన్నారు. దేశంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
అయ్యన్న పాత్రుడు రిమాండ్ తిరస్కరించిన కోర్టు
మాజీ మంత్రి , టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుకి కోర్టులో ఊరట లభించింది. అయ్యన్న రిమాండ్ ను కోర్టు తిరస్కరించింది. ఏపీ సీఐడీ అధికారులు ఆయనను భూ వివాదంపై అరెస్టు చేశారు. అయ్యన్న అరెస్ట్ కేసులో 467 సెక్షన్ వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. అయ్యన్న పాత్రుడు రిమాండ్ ను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసింది. 41ఏ నోటీసులు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకునే వీలు ఉంటుందని కోర్టు తెలిపింది. అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ కు బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత
ఏపీ సీఎస్ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తూ పక్కకు ఒరిగిపోయారు సీఎస్. ఇటీవలె ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. వెంటనే ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.
CM Jagan Avuku Tour: సీఎం జగన్ అవుకు పర్యటన నేడు
ఈ రోజు మధ్యాహ్నం సీఎం వైయస్ జగన్ నంద్యాల జిల్లా అవుకు పర్యటనకు వెళ్లనున్నారు. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. 3.35 గంటలకు నంద్యాల జిల్లా అవుకు చేరుకుంటారు. 3.50 – 4.30 వరకు దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరధ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు నివాళి అర్పించి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.35 గంటలకు అవుకు నుంచి బయలుదేరి 6.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)