News
News
X

Breaking News Live Telugu Updates: వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం

175 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్... ఆ మేరకు ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు సమావేశమై సరిగా పని చేయనివారికి సీట్లు ఉండబోవని చెప్పేశారు. ఇప్పుడు ఇంకా ఎలాంటి నిర్ణయాలు చెబుతారో అన్న ఆసక్తి నెలకొంది. 

CM Jagan News: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానం - సీఎం జగన్

పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని సీఎం జగన్​ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌ కో సిమెంట్‌ పరిశ్రమను సీఎం జగన్ బుధవారం ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది కూడా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. రామ్‌ కో పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని.. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని.. ఒక పరిశ్రమ వచ్చిందంటే అనేక ప్రయోజనాలు వస్తాయని అన్నారు. రామ్‌ కో పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పారు. పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది ప్రథమంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ప్రథమ స్థానంలో ఉంటున్నామని సీఎం జగన్ అన్నారు.

MLA Rajasingh: రేపు పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
 • రేపు పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందు హాజరు కానున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
 • రాజాసింగ్ ను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించనున్న పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు
 • ఇప్పటికే పీడీ యాక్ట్ ను రీవోక్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన రాజాసింగ్ కుటుంబ సభ్యులు
 • నాలుగు వారాలకు పిటిషన్ వాయిదా వేసిన హైకోర్టు
Byreddy Siddharth Reddy: టీడీపీ నాయకులకు ఘాటైన సవాల్ విసిరిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి!

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల కేంద్రంలో రాష్ట్ర యువ విభాగం అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వాసవీ మాత దర్శనం కోసం వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలో రాకపోతే తాను రాజకీయాల నుండి  శాశ్వతంగా తప్పుకుంటానని, టీడీపీ పార్టీ అధికారంలో రాకపోతే ఆ పార్టీ నాయకులు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం తగ్గిందని, అసంతృప్తి ఉందని ప్రచారం చేస్తున్నవారు తన సవాల్ ను స్వీకరించాలన్నారు. ఓటర్లు తమ అభిప్రాయాలను రోజు వెల్లడించరని ఎన్నికల్లో తెలియచేస్తారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. జరగబోయే ఎన్నికలు నీతికి అవినీతికి జరిగే ఎన్నికలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి గట్టి బుద్ధి చెబుతారన్నారు.ఇకనైనా టీడీపీ నాయకులు డబ్బా మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

Indira Devi Death: ఇందిరాదేవి అంత్యక్రియలకు మీడియాకు నో ఎంట్రీ - కృష్ణ కుటుంబసభ్యులు

‘‘మహాప్రస్థానంలో నేడు జరగనున్న ఇందిరా దేవి అంత్యక్రియల కవరేజ్ కు మీడియాకు అనుమతి లేదు. కవరేజ్ పద్మాలయా స్టూడియోస్ వరకే పరిమితం. దయచేసి మీడియా వారు సహకరించగలరు’’ అని కృష్ణ కుటుంబసభ్యులు తెలిపారు.

CM Jagan in Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
 • సాంప్రదాయ వస్త్రాలతో తిరునామం ధరించి స్వామి వారి సేవలో పాల్గొన్న సీఎం
 • ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు
 • రంగనాయకుల మండపంలో సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించిన వేదపండితులు
 • నూతనంగా ప్రారంభించిన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం
 • అనంతరం వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతనంగా నిర్మించిన టీటీడీకి ఇచ్చిన భవనాన్ని ప్రారంభించిన సీఎం
 • అనంతరం పద్మావతి అతిథి గృహం చేరుకుని అల్పాహారం స్వీకరించి రేణిగుంట విమానాశ్రయానికి ప్రయాణం కానున్న సీఎం
Tirumala News: వైభవంగా సాగుతున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
 • రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి
 • మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించనున్న అర్చకులు
 • రాత్రి హంస వాహనంను అధిరోహించి తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్న మలయప్ప స్వామి
Srisailam News: శ్రీశైలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు మయూరవాహానంలో కొలువుదీరగా ఈఓ ఎస్.లావన్న అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు దసరా ఉత్సవాలలో అమ్మవారు మొదటి రోజు శైలపుత్రీ అలంకార రూపంలో  దర్శనమివ్వగా రెండవరోజు బ్రహ్మచారిణిదేవిగా దర్శనమిచ్చింది.

కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి అమ్మవారి కరుణా కటాక్షాలతో బ్రహ్మచారిణి అలంకారంలో‌ దర్శనం ఇవ్వగ కన్నులపండుగగా ఆలయ పురవిధుల్లో  వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు చెక్క భజనలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవం కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు 
ఇప్పటికే దసరా మహోత్సవాలకు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులతో ఓంకారనాధ ధ్వనులతో శ్రీశైల శ్రీగిరులు మారుమ్రోగాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ట్రస్ట్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

Background

నైరుతీ రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో సీజన్ చివరిసారిగా భారీగా వర్షాలు కురవనున్నాయి. ఏపీ, తెలంగాణలో మంగళవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 1 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ.  వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
రాష్ట్రంలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. సెప్టెంబర్ 27 నుంచి ఆగస్టు 1 వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు ఇదివరకే ప్రకటించారు. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరికొన్ని గంటల్లో మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి.

ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో నేడు సైతం కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హైదరాబాద్ వాసులకు సూచించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం సూచన ప్రకారం.. ఈ ప్రాంతాల్లో అక్టోబర్ 1 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. గాలులు వేగంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని హెచ్చరించారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్, అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. మరో నాలుగు రోజుల వరకు ఈ ప్రాంతాలకు వర్ష సూచనతో ఎల్లో వార్నింగ్ జారీ అయింది. రాయలసీమలోనూ భారీ వర్షాలున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలున్నాయి. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.