News
News
X

Breaking News Live Telugu Updates: విద్యుదాఘాతానికి గురైన మూడేళ్ల దర్శిత్ మృతి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
విద్యుదాఘాతానికి గురైన మూడేళ్ల దర్శిత్ మృతి 

కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మూడేళ్ల దర్శిత్ మృతి చెందాడు. ఈ నెల 12న విద్యుదాఘాతానికి గురైన బాలుడు తన రెండు కాళ్లు కోల్పోయాడు. తాళ్లపూడి మండలం పైడిమట్ట గ్రామానికి చెందిన దర్శిత్ ఇటీవల విద్యుత్ షాక్ గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం దర్శిత్ కుటుంబ సభ్యులను  హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. దర్శిత్ మృతితో తల్లి తండ్రులు వినోద్, చాందిని, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట, 41 ఏ నోటీసులపై స్టే! 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంతోష్ కు ఇచ్చిన 41 ఏ నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.   

కోనసీమలో దారుణం, పార్క్ లో పసిపాపను వదిలి వెళ్లిన అగంతకులు 

Konaseema News : డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా  అమలాపురంలో దారుణం జరిగింది. అగంతకులు ఐదు రోజుల పసిపాపను వదిలి వెళ్లారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న కాటన్ పార్క్ లో ఐదు రోజుల పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. పసి పాప ఏడుపు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు పసిపాపను భద్రంగా అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స  అందిస్తున్నారు. పాపను వదిలి వెళ్లిన ఆగంతకులు ఎవరు అనేది  సీసీ కెమెరా ఫుటేజ్ ల ద్వారా  దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

Karimnagar: లోన్ యాప్ వేధింపులకి మరో యువకుడి బలి

లోన్ యాప్ వేధింపులకు కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు బలయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన సాయి నగర్ కు చెందిన శ్రీరాముల శ్రవణ్ అనే యువకుడు యాప్ ల ద్వారా దాదాపు మూడు లక్షల వరకు లోన్ తీసుకున్నాడు. అందులో కొంత డబ్బులను తన మిత్రులకు ఇచ్చాడు. వారు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ సంస్థల నిర్వాహకుల నుండి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో అతను ఈనెల 23 వ తారీఖున కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం సమీపంలో పురుగుల మందు తాగాడు. ఇది గుర్తించిన అక్కడి స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తొలుత గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లో మెరుగైన ట్రీట్మెంట్ కోసం పంపించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

AP New CS: ఏపీకి కొత్త సీఎస్ నియామకం

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించారు. కొత్త సీఎస్‌గా జవహార్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈయన గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన సంగతి తెలిసిందే. సీఎస్ పదవి కోసం తొలుత సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పేరు కూడా వినిపించింది. కానీ, చివరికి కేఎస్ జవహార్ పేరు ఖరారైంది.

Tirumala News: దుర్మార్గుడి పాలన నుండి రాష్ట్ర ప్రజలని కాపాడాలని శ్రీవారిని కోరుకున్నా - అయ్యన్నపాత్రుడు

 తిరుమలలో దర్శనం అనంతరం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. ‘‘స్వామి వారిని రెండు కోరికలు కోరుకున్నా దుర్మార్గుడి పాలన నుండి రాష్ట్ర ప్రజలని కాపాడాలని, విజయసాయిరెడ్డి పోయిన ఫోన్ లో ఢిల్లీ లిక్కర్ స్కాం, విశాఖ భూ దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు దొరికితే దోచిన సొమ్ము అంతా జప్తు అవుతాయి. తిరిగి మళ్ళీ ప్రజలకే ఆ డబ్బు వస్తుంది. కాబట్టి ఆ ఫోన్ తొందరగా దొరకాలని స్వామి వారిని కోరుకున్నా’’ అని అన్నారు.

Telangana SIT News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు
 • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు
 • నేడు సిట్ విచారణకు హాజరు కానున్న న్యాయవాది ప్రతాప్ గౌడ్, నంద కుమార్ భార్య చిత్రలేఖ
 • నంద కుమార్ తో, సింహ యాజీ, రామచంద్ర భారతిలతో ఉన్న సంబంధాలపై ప్రతాప్ గౌడ్ ను ప్రశ్నించనున్న సిట్
 • నంద కుమార్ కు సంబంధించిన వివరాలపై చిత్రలేఖను ప్రశ్నించనున్న సిట్
 • ఇప్పటికే బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాస్ లను FIR లో చేర్చిన సిట్
 • జగ్గు స్వామికి, తుషార్ కు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేసిన పోలీసులు
 • ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఈ నెల  29 న  విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన సిట్
 • హైకోర్టు ఆదేశాల మేరకు బీఎల్ సంతోష్ కు మరోసారి 41 ఏ నోటీసులు జారీ చేసిన సిట్
 • ఈ నెల 26 లేదా 28 న సంతోష్ సిట్ విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు
CPI Narayana: రుషికొండకు సీపీఐ నారాయణ, భారీగా మోహరించిన పోలీసులు
 • రుషికొండకు చేరుకున్న సీపీఐ నారాయణ 
 • నారాయణను రుషికొండ పరిశీలినకు అనుమతించిన టూరిజం అధికారులు 
 • రుషికొండ తవ్వకాలు పరిశీలిస్తున్న నారాయణ
 • రుషికొండ కూడలిలో బారీగా మోహరించిన పోలీసులు
 • పోలీసుల అదుపులో రుషికొండ ప్రాంతం
Background

ఈ నెలాఖరులోపు ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండం అవుతుందని భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ స్వల్ప ఉరుములు, మెరుపులతో చిన్నపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. వచ్చే మూడు రోజులు పెద్దగా వర్షాలు ఉండబోవని వెల్లడించారు.

బంగాళాఖాతం వైపున ఏర్పడ్డ గాలుల సంగమం బలపడటం వలన విశాఖ నగరం, జీవీఎంసీ నగర శివారు ప్రాంతాల్లో వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. భారీ, అతిభారీ వర్షాలు ఉండవు కానీ తేలికపాటి తుంపర్లు మాత్రం ఉంటాయని చెప్పారు. నిజానికి ఏ వెదర్ మాడల్ ఈ వర్షాలను చూపలేదనితెలిపారు.

‘‘ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలను ఆంధ్రప్రదేశ్ లో చూడగలము. ప్రస్తుతం విశాఖ నగరంలో మోస్తరు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అనకాపల్లి, గాజువాక వైపు మాత్రం కాసేపు వర్షాలు కొనసాగి తగ్గుముఖం పట్టనుంది. మరో వైపున ఈ వర్షాలు బంగాళాఖాతంలో కనిపిస్తున్న ఉపరితల ఆవర్తనానికి తేమను ఇస్తూ ఉంది. దీని వలన ఈ రోజు మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి అక్కడక్కడ మాత్రమే - కొనసీమ​, కాకినాడ​, ఎన్.టీ.ఆర్., కృష్ణా, బాపట్ల​, గుంటూరు, ఉభయ గోదావరి, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో వర్షాలను చూడగలము. అక్కడక్కడ మాత్రమే కాబట్టి మా ఇంటి మీద లేదు, మా ఊరిలో లేదు అనకండి. ఈ రోజు దక్షిణ ఆంధ్రలో తక్కువగానే వర్షాలుంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో నేడు (నవంబరు 25) దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి (నవంబరు 26) తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని అంచనా వేశారు.

‘‘ఆకాంశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.

వివిధ చోట్ల చలి ఇలా..
నేడు ఉదయం 8.30 గంటలకు తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, మెదక్ లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. సాధారణంగా 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పసుపు రంగు అలర్ట్ చేస్తారు. అందులో భాగంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పసుపు రంగు అలర్ట్ చేశారు. నిజామాబాద్ లో 19.2, రామగుండం 16.8, హన్మకొండ 18.5, భద్రాచలం 23.5, ఖమ్మం 23.6, నల్గొండ 18.4, మహబూబ్ నగర్ 22.7, హైదరాబాద్ 18.6  డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.