అన్వేషించండి

Breaking News Live Telugu Updates: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, తల్లీ కుమారుడు దుర్మరణం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, తల్లీ కుమారుడు దుర్మరణం

Background

చైనా రీ ఓపెనింగ్‌ తర్వాత ఆ దేశంలో కార్యకలాపాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో ర్యాలీ కొనసాగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.05 డాలర్లు పెరిగి 87.66 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.10 డాలర్లు పెరిగి 81.71 డాలర్ల వద్ద ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:
తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)
హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర మారడం లేదు. కొన్ని నెలలుగా ₹ 109.66 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.10 ---- నిన్నటి ధర ₹ 109.10
వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.31 ---- నిన్నటి ధర ₹ 109.32 
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.42 ---- నిన్నటి ధర ₹ 111.08 
నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.57 ---- నిన్నటి ధర ₹ 109.41 
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.47 ---- నిన్నటి ధర ₹ 109.78 
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.90 ---- నిన్నటి ధర ₹ 111.90 

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)
హైదరాబాద్‌లో (Diesel Price in Hyderabad) డీజిల్ ధరలోనూ మార్పు ఉండడం లేదు. లీటర్‌ డీజిల్‌ ₹ 97.82 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Diesel Price in Warangal) లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.29 ---- నిన్నటి ధర ₹ 97.29
వరంగల్ రూరల్ జిల్లాలో (Diesel Price in Warangal Rural) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.49 ---- నిన్నటి ధర ₹ 97.50 
నిజామాబాద్‌లో (Diesel Price in Nizamabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 99.46 ---- నిన్నటి ధర ₹ 99.14 
నల్లగొండలో (Diesel Price in Nalgonda) డీజిల్‌ నేటి ధర ₹ 97.72 ---- నిన్నటి ధర ₹ 97.57 
కరీంగనర్‌లో (Diesel Price in Karimnagar‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.63 ---- నిన్నటి ధర ₹ 97.92 
ఆదిలాబాద్‌లో (Diesel Price in Adilabad‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.90 ---- నిన్నటి ధర ₹ 99.90

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)
విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.92 ---- నిన్నటి ధర ₹ 111.76 
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.92 ---- నిన్నటి ధర ₹ ₹ 111.76 
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 110.48 ---- నిన్నటి ధర ₹ 110.48 
తిరుపతిలో (Petrol Price in Tirupati) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.16 ---- నిన్నటి ధర ₹ 111.52 
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు  నేటి ధర ₹ 111.10 ---- నిన్నటి ధర ₹ 111.10
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.37 ---- నిన్నటి ధర ₹ 112.22 
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.79 ---- నిన్నటి ధర ₹ 111.79

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)
విజయవాడలో (Diesel Price in Vijayawada) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.65 ---- నిన్నటి ధర ₹ 99.51 
గుంటూరులో (Diesel Price in Guntur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.65 ---- నిన్నటి ధర ₹ 99.51 
విశాఖపట్నంలో (Diesel Price in Visakhapatnam) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.27 ---- నిన్నటి ధర ₹ 98.27
తిరుపతిలో (Diesel Price in Tirupati) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.90 ---- నిన్నటి ధర ₹ 99.24
కర్నూలులో (Diesel Price in Kurnool) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.89 ---- నిన్నటి ధర ₹ 98.89 
రాజమహేంద్రవరంలో (Diesel Price in Rajamahendravaram‌) లీటరు డీజిల్‌ నేటి ధర 99.13 ---- నిన్నటి ధర ₹ 99.88 
అనంతపురంలో (Diesel Price in Anantapur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.52 ---- నిన్నటి ధర ₹ 99.52

14:24 PM (IST)  •  23 Jan 2023

AP Employees Union: ఏపీ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మీ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. వారం ోజుల్లో వివరణ ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) నుంచి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గవర్నర్ ను కలిసి సమస్యలను విన్నవించిన సంగతి తెలిసిందే. ఇది రోసా నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం చెప్పింది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా గవర్నర్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించింది.

14:13 PM (IST)  •  23 Jan 2023

Disha Case Update: దిశ కేసుపై నేడు హైకోర్టులో విచారణ

  • దిశ కేసు ఎన్ కౌంటర్‌పై కమిషన్ ఇచ్చిన నివేదికపై నేడు హైకోర్టులో విచారణ
  • ఎన్ కౌంటర్ కు గురైన బాధితుల తరపు వాదనలు పూర్తి
  • నేడు వాదనలు వినిపించనున్న ప్రభుత్వం
  • ఎన్ కౌంటర్ కు గురైన బాధితుల తరపు వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వేల్
  • ఎన్ కౌంటర్ జరిగిన తీరును కోర్టు దృష్టికి తీసుకొచ్చిన వృందా కార్వేల్
  • పోలీస్ కస్టడీ లో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీకన్‌‌స్ట్రక్షన్ పేరుతో ఎన్ కౌంటర్ చేశారన్న కార్వేల్
  • నేడు పిటిషన్ పై మరోసారి హైకోర్టు విచారణ
14:09 PM (IST)  •  23 Jan 2023

Tirumala Updates: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్సించుకున్నారు. ఈ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

12:27 PM (IST)  •  23 Jan 2023

Nellore News: తహశీల్దార్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా మర్రిపాడు తహశీల్దార్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని ఓ రైతు నిప్పంటించుకోబోయాడు. పొలం విషయంలో తనకు న్యాయం జరగలేదంటూ మహబూబ్ భాషా అనే రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపించాడు. ఆత్మహత్యాయత్నాన్ని స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు.

11:50 AM (IST)  •  23 Jan 2023

Union MInister కేంద్ర పథకాలను రాష్ట్రం అడ్డుకొంటోంది-కేంద్ర మంత్రి బీఎల్ వర్మ

ఆయుష్మాన్ భారత్, పసల్ బీమా యోజన వంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను  రాష్ట్రంలో అమలు చేయకుండా తెలంగాణప్రభుత్వం అడ్డుకొంటుందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహకార శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ తాడ్వయి మండలంలో పర్యటింన సందర్భంగా అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి ,పస్రా లలో  ఆదివారం భాజపా లోక్‌సభ ప్రవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళన కార్యక్రమాన్ని భాజపా జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... కేంద్రంలో మోదీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు.కెంద్ర సర్కారు కోట్లాది మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. పీఎం కిసాన్ యోజన కింద రైతుకు రూ. 6 వేల పంట సాయాన్ని ఇస్తుం దని, నిరుపేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తుందన్నారు. ఈ సందర్భంగా భాజ పాలో కొందరు నాయకులు చేరగా బీఎల్ వర్మ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

10:56 AM (IST)  •  23 Jan 2023

Undrajavaram Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, తల్లీ కుమారుడు దుర్మరణం

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ తల్లి, కుమారుడిని అస్పత్రికి తరలించగా అప్పటికే కుమారుడు మృతి చెందాడు. తల్లి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వీరి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బైక్ ​పై వెళ్తున్న తల్లి కుమారులను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. 

ఉండ్రాజవరం మండలం కె. సావరం గ్రామానికి చెందిన నార్ని పవన సూర్య గణేష్ (22), అతని తల్లి వెంకట సత్యవతి(51) పనిమీద ముప్పవరనికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు నిడదవోలు మండలం కలవచర్ల వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న కారు వీరిని వేగంగా ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు వారిని కాపాడేందుకు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు, చికిత్స అందిస్తుండగా తల్లి మృతి చెందింది. మృతదేహలను శవ పంచనామా కోసం మార్చురీకి తరలించారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget