అన్వేషించండి

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు అల్లేటి మహేశ్వర్‌ రెడ్డి రాజీనామా, ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు అల్లేటి మహేశ్వర్‌ రెడ్డి రాజీనామా, ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు

Background

ఈ రోజు ద్రోణి తూర్పు విదర్భ నుండి, మరాత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దిగువ స్థాయిలో గాలులు  ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీచుచున్నాయి. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా వచ్చే అవకాశం ఉంది.

పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన రాష్ట్రంలో అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC, చుట్టు ప్రక్కల జిల్లాలలో  40 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 40 శాతం నమోదైంది.

ఏపీలో ఎండలు ఇలా
నేటి నుంచి ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఒక పక్కన ఆంధ్రాలో ప్రస్తుతం 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చూస్తూ వచ్చాము. కానీ మరో మూడు రోజుల పాటు ఇది కాస్త 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉండనుంది. కారణం ఏమిటి అంటే పొడిగాలులు ఉత్తర భారత దేశం నుంచి నేరుగా మన వైపుగా వీస్తున్నాయి కాబట్టి వేడి తీవ్రత ఎక్కువవ్వనుంది. విశాఖ నగరంలో కూడ నేటి నుంచి మరో మూడు రోజులు వేడిగా ఉంటుంది. అనకాపల్లి, కాకినాడ​, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల​, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంధ్యాల​, కడప​, తూర్పు అనంతపురం, అన్నమయ్య​, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వేడి 42 నుంచి 43 మధ్యలో ఉండనుంది.

ఆంధ్రప్రదేశ్ లో విరగ కాస్తోంది. ప్రస్తుతానికి పొడి గాలులు కోస్తా ప్రాంతం మీదుగా వీస్తోంది కాబట్టి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలోని గుండ్లపల్లిలో అత్యధికంగా 43.2 డిగ్రీలు నమోదయ్యింది. అలాగే నంద్యాల​, కడప​, చిత్తూరు జిల్లాలో కూడ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి నమోదయ్యింది.

ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు - ఐఎండీ
 ఈ ఏడాది వ‌ర్షాకాలం సాధార‌ణంగా ఉండ‌నుందని, నైరుతీ రుతుప‌వ‌నాల వ‌ల్ల వ‌ర్షాలు సాధార‌ణంగా ఉంటాయ‌ని మంగళవారం భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ డాక్టర్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. వ‌ర్షాకాలం మ‌ధ్యలో ఎల్ నినో ప‌రిస్థితులు ఉత్పన్నం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దాని వ‌ల్ల రుతుప‌వ‌నాల‌పై ప్రభావం ప‌డుతుంద‌ని, సీజ‌న్ రెండో భాగంలో వ‌ర్షాలు త‌క్కువ‌గా కురిసే అవ‌కాశాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ తెలిపారు. 2023లో జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 96 శాతం వ‌ర్షపాతం ఉంటుంద‌ని ఐఎండీ చెప్పింది. జూలైలో ఎల్ నినో ప‌రిస్థితులు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

ఎల్ నినో వ‌ల్ల ప‌సిఫిక్‌ స‌ముద్ర ఉప‌రిత‌లం వేడిగా మారుతుంది. దీని వ‌ల్ల ప్రపంచ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణాల్లో మార్పు సంభ‌విస్తుంది. ఇండియాపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఒక‌వేళ నైరుతి రుతుప‌వ‌నాల స‌మ‌యంలో ఎల్‌నినో ఉంటే, అప్పుడు వ‌ర్షాలపై ప్రభావం ప‌డే అవకాశం ఉంది. దీని వ‌ల్ల రైతుల‌కు మ‌రిన్ని క‌ష్టాలు ఉంటాయి. ఎల్‌నినో వ‌ల్ల సాధార‌ణంగా భారత్ లో వ‌ర్షపాతం త‌క్కువ‌గా న‌మోదు అవుతుంది. దీంతో క‌రవు ప‌రిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

14:23 PM (IST)  •  13 Apr 2023

Peddapalli Journalist Death: రైలు కింద పడి శ్రీకాంత్ అనే జర్నలిస్టు ఆత్మహత్య

  • రామగిరి మండల వార్త దినపత్రిక జర్నలిస్ట్ పొన్నం శ్రీకాంత్ పెద్దపల్లి అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య
  • గత కొంతకాలంగా వార్త దినపత్రికలో పని చేస్తున్న శ్రీకాంత్ జర్నలిజం వృత్తిలో  కొందరు వ్యక్తులు అడ్డు తగులుతున్నారని మానసిక ఆవేదనతో ఆత్మహత్య
  • తన చావుకు కారణం రామగిరి మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు అని సామాజిక మాధ్యమాల లో పోస్ట్ చేసి ఆత్మహత్య
  • ముక్కలు ముక్కలుగా పడిపోయిన శ్రీకాంత్ శరీరభాగాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
12:40 PM (IST)  •  13 Apr 2023

Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ కు అల్లేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అల్లేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండగా, బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మారుతున్నారని భావించిన కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ నిన్న ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గంటలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. తాను చేసిన తప్పేంటో, ఎందుకు నోటీసులు ఇచ్చారో చెప్పాలని నిన్న మహేశ్వర్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

11:59 AM (IST)  •  13 Apr 2023

Vizag Steel Plant News: విశాఖపర్యటనలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి ఫగన్ సింహ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని అన్నారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయడానికి ప్రయత్నిస్తుండడం ఒక బూటకం మాత్రమేనని కొట్టిపారేశారు.

11:15 AM (IST)  •  13 Apr 2023

Hyderabad: కరెంటు షాక్ తగిలి అన్నదమ్ములు, మరో వ్యక్తి మృతి

హైదరాబాద్ లోని షేక్‌పేట పారామౌంట్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తో ఇద్దరు అన్నదమ్ములతో పాటు వారి స్నేహితుడు మృతి చెందారు. బంజారాహిల్స్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనస్‌ అనే 19 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో ఉన్న మోటారు స్విచ్‌ ఆన్‌ చేసేందుకు యత్నించగా కరెంట్‌ షాక్‌ తగిలింది. వెంటనే సమీపంలో ఉన్న రిజ్వాన్‌ (18) తన అన్నను కాపాడడానికి ముట్టుకున్నాడు. అతడికి కూడా షాక్ తగిలింది. అన్నదమ్ములను రక్షించేందుకు పక్కనే ఉన్న స్నేహితుడు రజాక్‌ ప్రయత్నించి, అతడు కూడా షాక్‌కి గురయ్యాడు. ముగ్గురూ ఘటనాస్థలంలోనే చనిపోయారు. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్రంగా విలపిస్తున్నాయి. పోస్టుమార్టం చేయడం కోసం పోలీసులు శవాలను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

11:11 AM (IST)  •  13 Apr 2023

Srikalahasthi News: కైలాసగిరుల్లో‌ దట్టమైన మంటలు, ఎట్టకేలకు అదుపులోకి

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధం ఆలయంలో ఒక్కటైన బావి (భరద్వాజ తీర్థం) గోసాలకి అతి సమీపంలోని కైలాసగిరుల్లో‌ బుధవారం సాయంత్రం నుండి దట్టమైన మంటలు అలముకున్నాయి.. అయితే బుధవారం మధ్యాహ్నం నుండి మంటలు యథేచ్ఛగా మండుతున్నప్పటికి శ్రీకాళహస్తీశ్వర హరిత అభివృద్ధి సిబ్బంది పట్టించుకోక పోవడంతో సాయంత్రానికి మంటలు భారీగా అలముకున్నాయి.. అయితే విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఆలయ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, మంటలు శ్రీకాళహస్తి ఆలయ గోశాల వైపుకు రాకుండా అదుపు చేశారు.. దాదాపు రెండు కిలో‌మీటర్ల మేర అగ్ని‌కీలలు వ్యాపించినట్లు అధికారులు అంచనా వేశారు.. కైలాసగిరిలో అర్ధారాత్రికి మంటలు‌ అదుపులోకి‌ ‌తీసుకుని రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget