అన్వేషించండి

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.29 లక్షల విద్యార్థులకు నిధులు జమ చేయనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విద్యార్థికి 75% హాజరు, ఆధార్‌తో బ్యాంక్ లింక్ తప్పనిసరి.

Talliki Vandanam Phase 2: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధుల జమకు రంగం సిద్ధమైంది. మొదటి విడతలో వివిధ కారణాలు, కొత్త అడ్మిషన్ల వల్ల నిధులు అందని విద్యార్థుల కోసం పరిశీలనలు, ఫిర్యాదుల పరిష్కారం ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో రెండో విడత లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 

2వ విడతలో 3.29 లక్షల మంది 

మొదటి విడత నిధులు విడుదల సమయానికి పాఠశాలల్లో 1వ తరగతి, జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులు, అలాగే ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలలో సవరణలు చేసుకున్న విద్యార్థుల వివరాలను అధికారులు పరిశీలించారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం, రెండో విడతలో మొత్తం 3,29,201 మంది అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది.  
వీరికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.10,208.69 కోట్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కార్పొరేషన్ల వారీగా రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులు 

 కార్పొరేషన్      -  అర్హులైన పిల్లలు    

  • AP మైనారిటీస్ కార్పొరేషన్ -    4,283  
  • ఆర్య వైశ్య కార్పొరేషన్-  3,708   
  • BC A కార్పొరేషన్-      53,506   
  • BC B కార్పొరేషన్   -   35,399     
  • BC C కార్పొరేషన్ -    874     
  •  BC D కార్పొరేషన్ -   43,317     
  •  BC E కార్పొరేషన్   -   25,252 
  •  బ్రాహ్మణ కార్పొరేషన్ -    1,583   
  •  EBC కార్పొరేషన్   -  7,180   
  • కమ్మ కార్పొరేషన్ -    6,889  
  • కాపు కార్పొరేషన్ -     25,963   
  • క్షత్రియ కార్పొరేషన్ -     1,104  
  •  రెడ్డి కార్పొరేషన్ -     11,201     
  • ఎస్సీ కార్పొరేషన్   -   74,760 
  •  ST కార్పొరేషన్   -   34,182  
  • మొత్తం విద్యార్థులు    -    3,29,201     

ఆర్థిక సాయం  

తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం.  ఇందులో రూ.13,000 నేరుగా తల్లి లేదా సంరక్షకుడి ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.  మిగిలిన రూ.2,000లను సంబంధిత స్కూల్ లేదా కాలేజీ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతుల నిర్వహణ నిధి కింద మినహాయిస్తారు. ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది.

Also Read: ఏపీ కేబినెట్ భేటీ- బీసీలకు రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికపై కీలక చర్చ

ఎవరు అర్హులు?

  1. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్స, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. 
  2. విద్యార్థికి కనీసం 75% పాఠశాల హాజరు తప్పనిసరి.
  3. కుటుంబ వార్షిక ఆదాయం, విద్యుత్ వినియోగం (300 యూనిట్ల కంటే తక్కువ), పరిమితికి లోబడి ఉన్న భూమి అనుగుణంగా ఉండాలి.
  4. లబ్ధిదారులు ఇవి చెక్ చేసుకోండి 
  5. డబ్బులు జమ అయ్యే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా లబ్ధిదారులు ఈ విషయాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
  6. తల్లి లేదా సంరక్షకురాలి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్, NPCI తో మ్యాప్ అయి ఉండాలి.
  7. మీ గ్రామ/వార్డు సచివాలయంలో లేదా విద్యాశాఖ పోర్టల్‌లో మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చేక్ చేసుకోవాలి. 
  8. నిధులు అకౌంట్ లో జమ అయిన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది.

Also Read: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్

Frequently Asked Questions

ఈ పథకానికి అర్హులు ఎవరు?

1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతూ కనీసం 75% హాజరున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ ఆదాయం, విద్యుత్ వినియోగం పరిమితులకు లోబడి ఉండాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rs 500 Notes Ban: మళ్లీ పెద్ద నోట్లు రద్దు! ప్రధాని మోదీని మరోసారి కోరతాం: ఏపీ సీఎం చంద్రబాబు
మళ్లీ పెద్ద నోట్లు రద్దు! ప్రధాని మోదీని మరోసారి కోరతాం: ఏపీ సీఎం చంద్రబాబు సంచలనం
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget