అన్వేషించండి

AP Pensions: ఏపీలో పింఛన్ల నిధులు విడుదల, జూన్‌ నెల సైతం వారికి బ్యాంకు ఖాతాల్లోనే!

AP Pensions : ఏపీలో పింఛన్ల నగదును జూన్ 1న లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కావాల్సిన నిధులను సర్కార్ విడుదల చేసింది.

AP Pensions : ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు ఎన్నికల నేపథ్యంలో గందరగోళం ఎదురైన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలో అసలు జూన్ నెలకు సంబంధించి పింఛన్లు తమకు వస్తాయా ? లేదా ? ఒక వేళ వస్తే ఎప్పుడు వస్తాయి?  ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్లు  ఇస్తారా, లేక మళ్లీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారా ?  ఇలా అనేక  ప్రశ్నలతో గందరగోళం మధ్య పింఛన్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే జూన్ నెలకు సంబంధించిన పింఛన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   

 జూన్ నెల పించన్ పంపిణీ ఇలా
ఈ మేరకు పింఛన్లను జూన్ 1న  లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ చైర్ లో ఉన్న వారికి నేరుగా వాళ్ల ఇంటి వద్దకే వెళ్లి వారికి పింఛన్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

పింఛన్ సొమ్ము విడుదల
జూన్ నెలకు చెల్లించాల్సిన సామాజిక భద్రతా పింఛన్ల డబ్బును విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  65,30,808 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.1,939.35 కోట్లను విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రకటించారు. జూన్ 1న 47,74,733 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పింఛను సొమ్ము జమ చేస్తామని చెప్పారు.  17,56,105 మంది లబ్ధిదారులకు జూన్ ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు.  ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.  సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్ డబ్బులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ లబ్ధిదారులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి..  ఏప్రిల్‌ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫించన్లను పంపిణీ చేశారు.   మే నెలలో బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసింది ప్రభుత్వం. ఇప్పుడూ కూడా మళ్లీ అదే విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
వడదెబ్బతో పలువురు మృతి
 గత నెలలో బ్యాంకు ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయడంతో లబ్ధిదారులు బ్యాంకులకు పోటెత్తారు. అక్కడ విపరీతమైన రద్దీ కారణంగా పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.   పింఛన్ కోసం బ్యాంకులకు వెళ్లి వడదెబ్బ కారణంగా అనేకమంది వృద్ధులు చనిపోయారు. మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో నేరుగా ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
Vijayawada Mayor Election : బెజవాడ మేయర్ సమరం - కూటమికి ఏబీవీనే ప్రధాన ప్రత్యర్థిగా మారారా?
బెజవాడ మేయర్ సమరం - కూటమికి ఏబీవీనే ప్రధాన ప్రత్యర్థిగా మారారా?
Vizianagaram Municipal Corporation Election: విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
Nagari Municipal Unopposed: నగరిలో ఏకగ్రీవాల షాక్ - రోజా టికెట్‌కే ముప్పు?
నగరిలో ఏకగ్రీవాల షాక్ - రోజా టికెట్‌కే ముప్పు?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizianagaram Municipal Corporation Election: విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని వెళ్లిపోగానే శ్వేత వచ్చిందా..రోహిత్‌పై ఆర్‌పీ సెటైర్లు! నోటికొచ్చినట్లు తిట్టుకుంటున్నారే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని వెళ్లిపోగానే శ్వేత వచ్చిందా..రోహిత్‌పై ఆర్‌పీ సెటైర్లు! నోటికొచ్చినట్లు తిట్టుకుంటున్నారే!
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
Pant Career Crossroads: టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
Cockroach Janata Party: దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
Embed widget