అన్వేషించండి

YS Sharmila : జగన్ చేసిన మోసాన్ని ప్రశ్నిస్తే తోక పార్టీ అంటారా ? - వైసీపీపై మరోసారి నిప్పులు చెరిగిన షర్మిల

Andhra Pradesh : వైసీపీపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన మోసాన్ని ప్రశ్నిస్తే టీడీపీకి తోక పార్టీ అనడం ఏమిటని ప్రశ్నించారు.

AP PCC chief Sharmila :  వైఎస్ఆర్‌సీపీపై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.  పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉంది YCP నేతల తీరు ఉందన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తమను తోక పార్టీ అనడంపై విరుచుకుపడ్డారు.  తల్లికి వందనం ఉత్తర్వులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే  బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని షర్మిల మండిపడ్డారు.  YCP నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే...  తాము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలని సూచించారు. 

తల్లికి వందనంపై ప్రభుత్వాన్నిప్రశ్నిస్తే తోక పార్టీ అంటారా ?                

తల్లికి వందనం GO 29 క్లారిటీ లేదని, సాక్షి పత్రిక రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేశామన్నారు. ఇలా డిమాండ్ చేయడం  కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు.  మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుందని గుర్తు చేశారు.  ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుందన్నారు.  YCP నేతలకు బహిరంగ సవాల్ చేస్తున్నానని  2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు. 

అమ్మఒడి పిల్లలందరికీ వర్తింప చేస్తామని చెప్పి మోసం చేసింది జగన్ కాదా ?                             

వైసీపీ ఇంట్లో ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి ఇస్తామని చెప్పిందని..  ఆ ముక్క పట్టుకొని తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాననన్నారు.  అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా అనేది చెప్పాలన్నారు. మోసం చేశారని ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోంది. ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా అని  మండిపడ్డారు. తాను  వైసీపీ కోసం బై బై బాబు కాంపెయిన్ చేయడం ఎంత నిజమో అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15000 రూపాయిలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజమన్నారు. 

చర్చకు సిద్ధమా ?                           

వైసీపీ నేతలకు 15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారని షర్మిల ప్రశ్నించారు.  మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు.. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని… జలయజ్ఞం పూర్తి చేస్తాం అని…  ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు కాంపెయిన్ చేయించారని ప్రశ్నించారు. వీటన్నింటిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
AP Local Body Elections: కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
AP Local Body Elections 2026 : ఏపీలో ఎన్నికల పండుగ - రాజకీయ పార్టీలకు టెన్షన్...టెన్షన్!
ఏపీలో ఎన్నికల పండుగ - రాజకీయ పార్టీలకు టెన్షన్...టెన్షన్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget