Breaking News Live: తిరుపతి బస్సు స్టాండ్ వద్ద మద్యం మత్తులో యువకులు హల్ చల్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికమైంది. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇకనుంచి రాయలసీమలో 41 నుంచి 44 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పగటి ఉష్ణోగ్రత 40 కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, అధిక ప్రభావం ఉండే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత 40 డిగ్రీల దాక ఉండనుంది. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా కావలిలో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, నందిగామలో 36.6 డిగ్రీలు, నెల్లూరులోనూ 36.6 డిగ్రీలు, విజయవాడలో 35.6 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 35.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రలు ఉన్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వడగాల్పుల వల్ల ఈ రోజు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల దాక ఎండల తీవ్రత ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతున్న వేడిగాలుల నుంచి కాస్తంత ఉపశమనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా 43 నుంచి 45 డిగ్రీలు దాక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిరుపతి, నెల్లూరు పరిసరాల్లో నిన్న తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. తిరుపతి నగరం నుంచి 85 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తివ్రత మరీ ఎక్కువగా లేదు. రిక్టర్ స్కేల్ మీద 3.6 నమోదయ్యింది. దీని వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్త్రి నష్టం జరగదు. మన కోస్తాంధ్ర తీరంలో ఇలాంటి స్వల్ప భూకంపం రావడం చాలా సహజం.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 39.2 డిగ్రీలు, నల్గొండలో 39.5 డిగ్రీలు, మెదక్‌లో 41.2 డిగ్రీలు, నిజామాబాద్‌లో 39.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎక్కువ ఎండలతో ఉక్కపోత, తేమ అధికం అవుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు నిలకడగానే ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,950 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,460 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.71,300 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,460 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,950 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,460గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,300 గా ఉంది.
తిరుపతి బస్సు స్టాండ్ వద్ద మద్యం మత్తులో యువకులు హల్ చల్
తిరుపతి బస్సు స్టాండ్ వద్ద రౌడీ మూకలు హల్ చల్ చేశాయి. నందీశ్వర ఆటోస్టాండ్ వద్ద సుబ్బు అనే వ్యక్తి అడ్రస్ అడగడంతో వివాదం తలెత్తింది. ఆటో డ్రైవర్లు మద్యం మత్తులో అసభ్యకర పదజాలంతో సుబ్బును దూషించడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మద్యం మత్తుల్లో దిలీప్ అనే వ్యక్తిపై మద్యం సీసా దాడి చేశారు ఆటో డ్రైవర్లు అశోక్, సుబ్బులు. గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చోద్యం చూస్తున్నారు. డ్రైవర్లు గొడవతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అశోక్, సుబ్బు, దీలిప్ లు గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సినీ ఫక్కీలో కిడ్నాప్, చాకచక్యంగా తప్పించుకున్న బాలుడు
సినీ ఫక్కీలో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో బాలుడు కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపింది. బాలుడిని కారులో ఎక్కించుకొని వరంగల్ వరకు దుండగులు తీసుకెళ్లారు. బాలుడు చేతులు కట్టేసి మత్తు ఇచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ నగరంలోని మట్టెవాడలో కారు ఆపడంతో బాలుడు దుండగుల నుంచి తప్పించుకున్నాడు. కారులో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు బాలుడు చెబుతున్నాడు. రేగొండ బాలుడు కిడ్నాప్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.





















