అన్వేషించండి

AP New Districts: కొత్త జిల్లాల్లో పోలీస్ సబ్ డివిజన్లకు ప్రతిపాదనలు, అత్యధిక పోలీస్ స్టేషన్లు ఈ జిల్లాలోనే!

AP New Districts: ఏపీలో ఉగాదికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పోలీసు సబ్ డివిజన్లపై ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు.

AP New Districts:  ఏపీలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఏప్రిల్ 2(ఉగాది) నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం(AP Govt) భావిస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాలకు ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించింది ప్రభుత్వం. రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు(Districts) ఏర్పాటుచేస్తున్నారు. వీటిలో తిరుపతి కేంద్రంగా ఏర్పడే శ్రీ బాలాజీ జిల్లా(Sri Balaji District) ఒకటి. చిత్తూరు నుంచి కొంత ప్రాంతాన్ని, నెల్లూరు నుంచి కొంత భాగం తీసుకుని శ్రీ బాలాజీ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధితో ఈ జిల్లా ఏర్పడుతోంది. అయితే ఇందులో చిన్న మార్పు జరిగింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సర్వేపల్లి నియోజకవర్గాన్ని మాత్రం నెల్లూరు(Nellore) జిల్లాలోనే ఉంచారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ బాలాజీ జిల్లాలోకి వెళ్లకపోయినా ఆ జిల్లాకు అధిక ప్రాధాన్యమే దక్కిందని చెప్పుకోవాలి. ఆ జిల్లా ప్రాధాన్యత దృష్ట్యా అత్యధిక పోలీస్ స్టేషన్లు అక్కడే ఏర్పాటు కాబోతుండటం విశేషం. 

బాలాజీ జిల్లాలో 54 పీఎస్ లు 

శ్రీ బాలాజీ జిల్లా పరిధిలో 54 పోలీసు స్టేషన్లు ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు రాయలసీమ(Rayalaseema), సౌత్‌ కోస్టల్‌ జోన్లు కలవబోతున్నాయి. అదే తరహాలో ఉద్యోగుల విభజనకూ సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలో 19 పోలీసు స్టేషన్లు ఉండగా దీనికి అదనంగా గూడూరు(Gudur) సబ్‌ డివిజన్‌ లోని 19 పీఎస్ లు, సత్యవేడు సర్కిల్‌ పరిధిలోని పీఎస్ లు కలుస్తాయి. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక పోలీసు స్టేషన్లున్న జిల్లాగా బాలాజీ జిల్లా అవతరించబోతోంది. 

కొత్తగా మూడు పోలీస్ సబ్ డివిజన్లు

శ్రీ బాలాజీ జిల్లాకు ఇప్పటికే తిరుపతిలో తాత్కాలిక కలెక్టరేట్‌ ఖరారు చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా శాశ్వత కలెక్టరేట్‌(Collectorate) భవనాలు నిర్మించేందుకు అధికారులు తిరుపతి, ఏర్పేడు, రేణిగుంట ప్రాంతాల్లో భూములు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. పోలీసు శాఖలోనూ విభజన కసరత్తు ఇప్పటికే మొదలైంది. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఏడు నియోజక వర్గాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అందులో భాగంగా మూడు కొత్త పోలీసు సబ్‌ డివిజన్లు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం తిరుపతి తూర్పు, పశ్చిమ, రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుమల సబ్‌ డివిజన్లు ఉన్నాయి. 

కీలక కేంద్రాలన్నీ బాలాజీ జిల్లాలోనే
 
శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటుతో గూడూరు సబ్‌ డివిజన్‌ కూడా కొత్త జిల్లా పరిధిలోకి వస్తుంది. శ్రీహరికోటలోని షార్(SHAR) అంతరిక్ష కేంద్రం, తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ సెజ్‌ దీని పరిధిలోకి వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా మూడు పోలీసు సబ్‌ డివిజన్లు చంద్రగిరి, సత్యవేడు, నాయుడుపేటల్లో ఏర్పాటు చేస్తే భద్రతాపరంగా సమస్యలు ఉండవని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. 

రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత జోనల్ బదిలీలు

కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని సర్కిల్‌ స్థాయి పోలీసు అధికారులను అక్కడికక్కడే మార్పులు చేయాల్సి ఉంటుంది.  రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే వరకు శ్రీ బాలాజీ జిల్లా, తిరుపతి ఎస్పీ పరిధిలో పనిచేసినా సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజక వర్గాల వారిని చంద్రగిరి, సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి పరిధిలో బదిలీ చేసే అవకాశం ఉండదు. దీనికి జోనల్ రిజర్వేషన్లు అడ్డుగా ఉంటాయి. జోన్ల విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తరువాత బాలాజీ జిల్లా పరిధిలో పూర్తి స్థాయి బదిలీలు ఉంటాయి. అయితే జిల్లాల విభజన అనంతరం ఏర్పడే కొత్త జిల్లాల్లో అత్యధిక కీలక ప్రాంతాలతో పాటు, అత్యధిక పోలీస్ స్టేషన్లు ఉండే జిల్లాగా కూడా బాలాజీ జిల్లా రికార్డులకెక్కుతుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balakrishna : టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Distributor Hari Death: టాలీవుడ్‌లో విషాదం... నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి మృతి
టాలీవుడ్‌లో విషాదం... నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి మృతి

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget