ఎన్నికలు జరగకముందే 17 పురపాలక సంఘాల్లో చైర్‌పర్సన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ 15, జనసేన 1, బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి.
AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
AP Local Body Elections | ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే 17 పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్ స్థానాలు, రాష్ట్రవ్యాప్తంగా 726 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని కూటమి ప్రభంజనం సృష్టించింది.

- స్థానిక ఎన్నికల్లో కూటమి 17 పురపాలక చైర్‌పర్సన్‌లను ఏకగ్రీవంగా గెలుచుకుంది.
- మొత్తం 726 మంది అభ్యర్థులు వివిధ స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచి సత్తా చాటారు.
- వైఎస్ జగన్ స్వంత జిల్లాలోనూ కూటమి అభ్యర్థులు ఆధిపత్యం చూపారు.
- టీడీపీ 660, జనసేన 38, బీజేపీ 28 ఏకగ్రీవ విజయాలు సాధించాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ జరగడానికి ముందే అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికలు జరగకముందే 17 పురపాలక సంఘాల్లో కూటమి అభ్యర్థులు చైర్‌పర్సన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థులు 15 మంది, జనసేన, బీజేపీల నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం 17 మంది ఛైర్‌పర్సన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏకగ్రీవాల వివరాలు, పార్టీల బలాబలాలు
రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని డివిజన్లు, వార్డులలో కలిపి కూటమికి చెందిన 726 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొంది సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన మొత్తం స్థానాల్లో టీడీపీ 660, జనసేన 38, బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ 19, సీపీఐ 1, స్వతంత్రులు 5 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. సగటున మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం స్థానాలు ఏకగ్రీవమయినట్లు తెలుస్తోంది.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని 3 పట్టణ స్థానిక సంస్థల్లో ఛైర్‌పర్సన్లతో సహా అన్ని వార్డులనూ కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
జగన్, పెద్దిరెడ్డిల అడ్డాలో కూటమి ప్రభంజనం
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 8 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 6 చోట్ల కూటమి అభ్యర్థులే ఏకగ్రీవంగా ఛైర్‌పర్సన్లుగా ఎన్నిక కావడం రాజకీయంగా ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. కడప నగరపాలక సంస్థలో మొత్తం 66 డివిజన్లలో 50 డివిజన్లు ఏకగ్రీవం కాగా, కేవలం 16 డివిజన్లలో పోలింగ్ జరగనుంది.
పులివెందులలో మొత్తం 40 వార్డులు ఉండగా, 20 వార్డులు కూటమికి ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు, నగరి విషయానికి వస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నియోజకవర్గం పుంగనూరులోనూ, చిత్తూరు జిల్లా నగరి పురపాలక సంఘంలోనూ చైర్‌పర్సన్ పదవులు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీ ఏకగ్రీవాలు
మొత్తం 13 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 6 కార్పొరేషన్ల పరిధిలోని 116 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. అందులో టీడీపీ 109, జనసేన 3, బీజేపీ 3, వైసీపీ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో మొత్తం 637 వార్డులు ఏకగ్రీవం కాగా.. అందులో టీడీపీ 553, జనసేన 35, బీజేపీ 25, వైసీపీ 18, సీపీఐ 1, స్వతంత్రులు 5 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు.
ఏకగ్రీవమైన ఛైర్‌పర్సన్ స్థానాలు
పల్నాడు జిల్లా దాచేపల్లి - తంగెళ్ల శ్రీనివాసరావు (టీడీపీ)
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల - బాబావలి (టీడీపీ)
పల్నాడు జిల్లా గురజాల - నెలవల్లి బాల్ రెడ్డి (టీడీపీ)
ప్రకాశం జిల్లా దర్శి - దారం సుబ్బారావు (జనసేన)
మార్కాపురం జిల్లా కనిగిరి - అచ్చాల తిరుపతమ్మ (టీడీపీ)
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ - షేక్ అనీషా (టీడీపీ)
నంద్యాల జిల్లా ఆత్మకూరు - డాక్టర్ గోవిందరాజులు (టీడీపీ)
చిత్తూరు జిల్లా నగరి - శ్రీనివాసన్ (టీడీపీ)
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు - ఎస్. దివ్యతేజ (టీడీపీ)
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు - నంద్యాల రాఘవరెడ్డి (టీడీపీ)
వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం - జి. స్వప్న (టీడీపీ)
వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల - మధులత (బీజేపీ)
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు - ధనపాల జగన్‌మోహన్ (టీడీపీ)
వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట - దొంతం గాయత్రి (టీడీపీ)
అన్నమయ్య జిల్లా పుంగనూరు - నయీమ్ తాజ్ (టీడీపీ)
అన్నమయ్య జిల్లా రాయచోటి - షేక్ ఖాదర్ వలీ (టీడీపీ)
అనంతపురం జిల్లా గుత్తి - తమిళ్ సెల్వి (టీడీపీ)
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది చైర్‌పర్సన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది?
రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో కలిపి కూటమి 726 స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందింది.
మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో కూటమి పనితీరు ఎలా ఉంది?
జగన్ సొంత జిల్లా కడపలోని 8 పురపాలక సంఘాలకు గాను 6 చోట్ల కూటమి అభ్యర్థులే చైర్‌పర్సన్‌లుగా ఏకగ్రీవమయ్యారు. కడపలో 50 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























