అన్వేషించండి
Vangalapui Anitha: ఏపీ హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం
Telugu News: వంగలపూడి అనిత కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది.

మంత్రి అనిత
Source : x
Vangalapui Anitha Latest News: హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అది స్వల్పంగా ధ్వంసమైంది. వెంటనే ఆమె మరో వాహనంలో వెళ్లిపోయారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురంకు హోం మంత్రి అనిత వెళ్తున్నారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కారు, ఎస్కార్ట్ వాహనం కొద్దిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మంత్రి అనిత మరో కారులో వెళ్లారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion