By: ABP Live Focus | Updated at : 11 Feb 2022 09:45 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
శ్రీశైలం ఆలయం(ఫైల్ ఫొటో)
ఈ నెల 14న జరగాల్సిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 15 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం జీవో 84ను జారీ చేసింది. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సభ్యుల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వేణుగోపాల్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ట్రైబల్ చరిత్ర కలిగిన దేవాలయంలో గిరిజనులకు ప్రాతినిథ్యం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవేత్తలు ఉండాలని, కానీ ప్రస్తుత ట్రస్ట్ బోర్డులో అలా లేరని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
మూడు వారాల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు
ఆలయంపై అవగాహన లేనివారు బోర్డులో సభ్యులుగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం మూడు వారాల వరకు బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారంపై కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈనెల 14న జరుగనున్న ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
ఛైర్మన్ ఎంపికపై వైసీపీలో వైరం
శ్రీశైలం ఆలయ పాలకమండలి నియామకం అధికార వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. బోర్డ్ ఛైర్మన్ గా ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థివర్గానికి చెందిన చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీంతో రోజా పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమచారం. తనను ఓడించడానికి ప్రయత్నించడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా చక్రపాణి రెడ్డి వ్యవహరించారని ఎమ్మెల్యే రోజా ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఇరువురు బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. అలాంటిది చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని రోజా అంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే రాజీనామాకు కూడా సిద్ధమేనని రోజా ఇప్పటికే తెలిపారు. 2021 జులైలో ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా తొలగించారు. అప్పటి నుంచి పార్టీలో రోజాకు గడ్డుకాలం నడుస్తోంది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆమెకు ఎలాంటి పదవీ లేకపోవటంతో రోజా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో మెట్టు గోవిందారెడ్డిని ఏపీఐఐసీ ఛైర్మన్‌గా సీఎం జగన్ నియమించారు. రోజాకు ఇప్పటి వరకు కేబినెట్ లో స్థానం దక్కలేదు.
Also Read: ఏపీలో పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు!
Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
Breaking News Live Updates : ఆత్మకూరులో ఉద్రిక్తత, కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల, జులై, ఆగస్టు కోటా రిలీజ్
CM Jagan Davos Tour Contro : దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?
CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!
Russia Ukraine War : ఉక్రెయిన్పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!