అన్వేషించండి

AP Pensions: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక అప్ డేట్ - వారికి మాత్రం అకౌంట్లలో జమ, సీఎస్ కీలక ఆదేశాలు

Andhrapradesh News: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జులై 1నే పూర్తిగా పంపిణీ చేసేలా చర్యలు చేపడుతుండగా.. 43 వేల మందికి నేరుగా అకౌంట్లలో జమ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు.

Pensions Distribution In AP Key Update: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన పింఛన్లను జులై 1 నుంచి ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించింది. ఒక్కో ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూడాలన్నారు. ఈ మేరకు సీఎస్ నీరభకుమార్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలిచ్చారు. జులై 1వ తేదీనే (సోమవారం) లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఒకవేళ ఎవరైనా మిగిలితే మంగళవారం పంపిణీ చేయాలని సూచించారు. డబ్బులను ఈ నెల 29నే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. 

ఎరియర్లతో కలిపి రూ.7 వేలు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాల్లో పింఛన్ల పెంపు ఒకటి. ఇటీవల కేబినెట్ భేటీలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీని ప్రకారం ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు ఇతర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్ము రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన క్రమంలో.. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఎరియర్లతో కలుపుకొని మొత్తం రూ.7 వేల పింఛన్ జులైలో అందజేయనున్నారు. రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ.15 వేలు, నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన పింఛన్ సొమ్ము అందించనున్నారు.

వారికి అకౌంట్లలో జమ

పెరిగిన పింఛన్ల మేరకు 65,18,496 మందికి రూ.4,399.89 కోట్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో 64.75 లక్షల మందికి ఇంటి వద్ద రూ.4,369.82 కోట్లు ఇంటి వద్ద అందిస్తారు. మిగిలిన 43 వేల మంది అంటే బయట చదువుకునే దివ్యాంగ్ విద్యార్థులకు రూ.30.05 కోట్లను డీబీటీ ద్వారా వారి అకౌంట్లలోకి జమ చేస్తారు. జులై 1 ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేశారు.

Also Read: AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
Visakha Building Collapse: జాకీలతో లేపుతుండగా కూలిన భవనం, ఒకరు మృతి - విశాఖపట్నంలో విషాదం
జాకీలతో లేపుతుండగా కూలిన భవనం, ఒకరు మృతి - విశాఖపట్నంలో విషాదం
Telangana Rains: తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
IPL 2026 GT VS PBKS Result Update: GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
Embed widget