అన్వేషించండి

AP Cyclone Arnab Relief Package: ఆర్నాబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ప్యాకేజీ - ఎవరికి ఎంత సాయం? పూర్తి వివరాలు!

Cyclone Arnab Compensation: ఏపీలో ఆర్నాబ్ తుఫాన్ బాధితులకు చంద్రబాబు ప్రకటించిన నష్టపరిహార ప్యాకేజీ వివరాలు. పంటలు, ఇళ్లు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందిస్తారు.

Andhra Pradesh Cyclone Relief Essentials Distribution:  తీవ్రమైన ఈదురుగాలులు, అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన  ఆర్నాబ్  తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నష్ట తీవ్రతపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించి, తుఫాన్ ప్రభావానికి గురైన ప్రతి పేద కుటుంబానికి, రైతులకు, మరియు వ్యాపారులకు ఆర్థిక ఊరటనిచ్చే సమగ్ర సహాయక ప్యాకేజీని ప్రకటించారు. అత్యవసర సహాయక చర్యల్లో ఏ ఒక్క బాధితుడూ నష్టపోకూడదని, పారదర్శకంగా అర్హులందరికీ నష్టపరిహారం నేరుగా అందుతుందని ఆయన భరోసానిచ్చారు.

ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. అలాగే నివాసాల్లోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడిన కుటుంబాలకు, పాక్షికంగా లేదా పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్న నివాసాలకు రూ.10,000 తక్షణ ఆర్థిక నిధిగా విడుదల చేయనున్నారు. ఇక అత్యవసర పునరావాస శిబిరాల్లో తలదాచుకుని తిరిగి ఇళ్లకు వెళ్తున్న బాధితులకు తక్షణ వ్యయాల కోసం ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున  కుటుంబానికి గరిష్టంగా రూ.3,000 వరకు  నగదు పంపిణీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

ఆహార భద్రత కల్పించే దిశగా వరద ముంపు బాధితులకు 25 కేజీల బియ్యంతో పాటు మత్స్యకారులు, చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కేజీల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు ఉచిత నిత్యావసర ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు మరియు కేజీ పంచదారను తక్షణమే పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖకు సూచించారు. ప్రాథమిక జీవనోపాధి దెబ్బతిన్న తోపుడు బండ్ల వ్యాపారులకు రూ.20,000, చిన్న కిరాణా కొట్టు యజమానులకు రూ.25,000, దెబ్బతిన్న టూ-వీలర్లకు రూ.3,000 , ఆటోలకు రూ.10,000 మరమ్మతు వ్యయాన్ని ప్రభుత్వం భరించనుంది.

తీవ్రంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు సైతం భారీ ఊరట లభించింది. పంట నష్టపోయిన రైతాంగానికి హెక్టారు ప్రాతిపదికన వర్గీకరించి సాయం అందిస్తున్నారు. పత్తి, చెరకు, వరి, ఉల్లి, టమోటా మరియు పూల తోటలకు హెక్టారుకు రూ.25,000 చొప్పున, అరటి, పసుపు, మామిడి వంటి ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.35,000 చొప్పున, తమలపాకు తోటలకు రూ.75,000 వరకు పరిహారం ప్రకటించారు. ఆయిల్ పామ్, కొబ్బరి చెట్లు నేలకొరిగితే ఒక్కో చెట్టుకు రూ. 1,500 సాయం ఇస్తుండగా, వేట పరికరాలు, బోట్లు దెబ్బతిన్న మత్స్యకారులకు రూ. 5,000 నుండి రూ. 25,000 వరకు నష్టపరిహారం ఇవ్వనున్నారు.

 ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వం అందించే తక్షణ బాసట బాధితులకు కొండంత కొండంత అభయాన్ని ఇస్తుంది. శాశ్వత పునరావాస చర్యలతో పాటు మౌలిక వసతుల పునరుద్ధరణను కూడా వేగవంతం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయి గణాంకాలను పారదర్శకంగా సేకరించి, దళారుల ప్రమేయం లేకుండా ప్రతి పైసా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా డీబీటీ విధానంలో సహాయం అందించడం ద్వారా ఆర్నాబ్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వేగవంతమైన ముందడుగు వేస్తోంది.
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
MPTC and ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget