News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

విశాఖలో పెట్టుబడులు, పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

వైఎస్సార్ సీపీ అదికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాద్యతలు చేపట్టిన తరువాత పరిశ్రమలు, వాటి పురోగితికి సంబందించిన అంశాలపై సమీక్షా సమావేశంలో సమగ్రంగా చర్చ జరిగింది.

FOLLOW US: 
Share:

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఒప్పందాలు అమలుపై సీఎం వైయస్‌.జగన్ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం కు అదికారులు నివేదిక ను సమర్పించారు.

నాలుగేళ్ళలో ఏం జరిగింది....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాద్యతలు చేపట్టిన తరువాత పరిశ్రమలు, వాటి పురోగితికి సంబందించిన అంశాలపై సమీక్షా సమావేశంలో సమగ్రంగా చర్చ జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వృద్ధిని గురించి అదికారలు సీఎంకు వివరించారు. స్థిరధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36 శాతం, ఇది దేశ సగటు 6.5శాతం కన్నా తక్కువ అని వివరించిన అధికారులు, గడచిన నాలుగేళ్లలో మంచి ప్రగతి ఉందని సీఎంకు తెలిపారు. 2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 11.43శాతానికి పెరగం శుభపరిణామం అయితే ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తున్నామని అదికారులు అంటున్నారు. 2022-23లో జీడీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ 16.22 శాతంగా ఉందని, జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందన్నారు. పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని, 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయని  అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

ఉత్పత్తుల్లో మనం అదుర్స్..
2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి కాగా, 2021-22లో ఎగుమతుల విలువ 1.43 లక్షల కోట్లు ని, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. రూ.1.6లక్షల కోట్లు పెరిగిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్రని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా సూచించారు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయని, ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు ఏంటి.. వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం.. ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడటంతో పాటుగా,ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్‌ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఇందుకు  ఒక కార్యదర్శిని కూడా నియమించాలని సీఎం అన్నారు. రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలని, నైపుణ్యాలను పెంచడం పైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని అదికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ఒప్పందాలు… ప్రతిపాదనలు
పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని వివరాలను అందరికి తెలిసేలా చూడాలని అదికారులను సీఎం అదేశించారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి.. 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలపటం అభినందనీయమని, వీటిద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని వెల్లడించారు. 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారని, అయితే ఇందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని జగన్ అన్నారు.

Published at : 05 Jun 2023 06:32 PM (IST) Tags: AP Latest news Telugu News Today AP Investments Vizag summit AP CM News

ఇవి కూడా చూడండి

Vizag Beach Wooden Box: విశాఖ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పెట్టె, తెరిచిన అధికారులు - అందులో ఏముందంటే?

Vizag Beach Wooden Box: విశాఖ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పెట్టె, తెరిచిన అధికారులు - అందులో ఏముందంటే?

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసి ప్రభుత్వం

Breaking News Live Telugu Updates: చంద్రబాబు మాజీ పీఎస్‌  శ్రీనివాస్‌ను  సస్పెండ్ చేసి ప్రభుత్వం

dead Storage in Krishan basin: కృష్ణా పరివాహకంలో నీటి గోస-ప్రాజెక్టుల్లో అరకొర నీటి నిల్వలు

dead Storage in Krishan basin: కృష్ణా పరివాహకంలో నీటి గోస-ప్రాజెక్టుల్లో అరకొర నీటి నిల్వలు

Roja on Brahmani: అవినీతిపరుడికి మద్దతుగా మోత మోగించాలా ఇదెక్కడి విడ్డూరం- బ్రాహ్మణికి రోజా కౌంటర్

Roja on Brahmani: అవినీతిపరుడికి మద్దతుగా మోత మోగించాలా ఇదెక్కడి విడ్డూరం- బ్రాహ్మణికి రోజా కౌంటర్

టాప్ స్టోరీస్

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ మామూలుగా ఉండదు - హరీష్ శంకర్ ఇచ్చిన అప్డేట్ చూశారా?

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ మామూలుగా ఉండదు - హరీష్ శంకర్ ఇచ్చిన అప్డేట్ చూశారా?

లిప్‌స్టిక్‌లు పెట్టుకునే మహిళలకు రిజర్వేషన్‌లు ఎందుకు - ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

లిప్‌స్టిక్‌లు పెట్టుకునే మహిళలకు రిజర్వేషన్‌లు ఎందుకు - ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు

Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు

KGF 3: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!

KGF 3: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!